అమ్మాయిలు ఆ ట్రాప్‌లో పడకండి.. అదొక మాయ | Rhea Chakraborty Warns Girls Do Not Fall Into The Instagram Trap | Sakshi
Sakshi News home page

Rhea Chakraborty : అమ్మాయిలు ఆ ట్రాప్‌లో పడకండి.. అదొక మాయ

Published Sat, Jan 8 2022 6:22 PM | Last Updated on Sat, Jan 8 2022 6:26 PM

Rhea Chakraborty Warns Girls Do Not Fall Into The Instagram Trap - Sakshi

Rhea Chakraborty Warns Girls Do Not Fall Into The Instagram Trap: అమ్మాయిలు అందంగా ఉండేందుకు అనేక దారులు వెతుకుతారు. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రం అందంగా ఉండటానికి బదులు కనపడేందుకే ఆసక్తి చూపుతుంటారు. అలాగే బ్యూటిఫుల్‌గా కనిపించే ఫొటోలనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. బెస్టీలు ఎవరైనా తాము బాగా కనిపించని పిక్స్ అప్‌లోడ్‌ చేస్తే కాల్‌ చేసి మరి వారిపై విరుచుకుపడతారు. అందుకే ఇలాంటి వారికోసం బ్యూటీ ఫిల్టర్లు అందిస్తున్నాయి కొన్ని యాప్స్. వివిధ  రకాల ఫిల్టర్స్‌ వాడి ఫొటోస్‌ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మురిసిపోతుంటారు. కానీ అది వారి నిజమైన సోయగం అని మాత్రం ఆలోచించరు. 

ఇలాంటి వారికోసమే బాలీవుడ్‌ బ్యూటీ రియా చక్రవర్తి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. ఇటీవల ఆసక్తికరమైన సంభాషణలు, స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లతో సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటోంది రియా. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో ఫిల్టర్‌లు వాడే అమ్మాయిలకు జాగ్రత్తలు చెబుతోంది. ఇన్‌స్టా గ్రామ్‌ బ్యూటీ ఫిల్టర్ల వలలో పడకండి అంటూ పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్ట్‌లో 'అమ్మాయిలందరికీ ఒక చిన్న విన్నపం. మీరు ఇన్‌స్టా బ్యూటీ ఫిల్టర్‌ల ట్రాప్‌లో పడకండి. అదొక మాయ. మీరు ఎలా ఉన్నారో అదే మీ అందం. ఈ మధ్య మీరు ఈ ఇన్‌స్టా బ్యూటీ, ఫిల్టర్ల గురించి ఎలా ఫీల్ అవుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారందరికీ నెను చెప్పేది ఒక్కటే. మీకు మీరుగా ఉండటమే నిజమైన అందం.' అని తెలిపింది రియా. 

ఇదీ చదవండి: ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement