![Rishab Shetty Request To People Do Not Imitate The Sound From Kantara - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/22/kantara.jpg.webp?itok=5GiuKnn8)
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచానాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగుతో పాటు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
(చదవండి: జపాన్ వీధుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సందడి..వీడియో వైరల్)
భూతకోల సంస్కృతిని తెలియజేస్తూ ఈ కథను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. కోలం ఆడే వ్యక్తి ‘ఓ..’అంటూ అరుస్తూ డ్యాన్స్ చేస్తాడని ఈ సినిమాలో చూపించారు. ఆ శబ్దం వచ్చిన ప్రతిసారి థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ప్రేక్షకులు కూడా ఆ అరుపులను అంత ఈజీగా మర్చిపోవడం లేదు. సినిమా చూసి బయటకు వచ్చాక ‘ఓ..’ అంటూ గట్టిగా శబ్దం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందించారు. ‘ఓ..’అని శబ్దం చేయడం తమ సెంటిమెంట్ అని, ఇదొక నమ్మకమని అన్నారు. ‘కాంతార’ వీక్షించిన ప్రేక్షకులు ఈ శబ్దాలను అనుకరించొద్దని విజ్ఞప్తి చేశాడు. అది చాలా సున్నితమైన అంశమని, బయట ఇలా శబ్ధం చేయడం వల్ల తమ ఆచారం దెబ్బ తినొచ్చని అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment