బాలీవుడ్ క్యూట్ బ్యూటీ, ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్లో అలియా యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఆలియా భట్.. పేరునే పరిచయంగా, ప్రతిభనే ఉనికిగా మార్చుకున్న నటి. ఫ్యాషన్‌లోనూ అంతే ప్రత్యేకతను చాటుతోంది... ఈ బ్రాండ్స్‌తో!
మాధుర్య క్రియేషన్స్...
పేరుకు తగ్గట్టే చక్కటి ఆభరణాలను డిజైన్ చేస్తుందీ సంస్థ. బెంగళూరుకు చెందిన భానుమతి నరసింహన్ స్థాపించిన ‘గిఫ్ట్ ఎ చైల్డ్’ స్వచ్ఛంద సంస్థ కోసం ఈ మాధుర్య క్రియేషన్స్ పనిచేస్తుంది. 2007లో ప్రారంభించిన ఈ సంస్థ, మొదట కేవలం ఆభరణాలనే అందించే వారు. ప్రస్తుతం ఆభరణాలతో పాటు ట్రెడిషనల్ డిజైన్స్‌లో చీరలు, గృహ అలంకరణ సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ఎక్కువగా హస్తకళలకు ప్రాధాన్యం ఇస్తారు. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు.
పాయల్ ఖండ్‌వాలా..
టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో పాయల్ ఖండ్‌వాలా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో లభించే ఈ డిజైన్స్‌కు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. 2012లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పాయల్ తన పేరు మీదే ‘పాయల్ ఖండ్‌వాలా’ పేరుతో మొదలుపెట్టిన ఈ ఫ్యాషన్ బ్రాండ్ అంటే ప్రతి ఒక్కరికీ క్రేజే. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు స్పెషల్‌గా దుస్తులను డిజైన్ చేయించుకునే వీలు కూడా ఉంటుందిక్కడ. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి.
పాయల్ ఖండ్‌వాలా బ్రాండ్ డ్రెస్ ధరలు
కుర్తా- రూ. 47,500
పలాజో- రూ. 64,500
దుపట్టా- రూ. 17,500
మాధురి క్రియేషన్స్ బ్రాండ్ జ్యూయెలరీ ధర- రూ. 9,400
'చాలామంది ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రింజ్ ట్రెండ్ అంటే ఇష్టపడతారు కానీ, నాకెందుకో ఆ స్టయిల్ డిజైన్స్ పెద్దగా నచ్చవు. అది తప్ప మిగితా ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నింటినీ నేను ఫాలో అవుతా.' అని అలియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment