Sai Dharam Tej Health Condition Updates: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మెగా హీరో సాయిధరమ్‌తేజ్ చికిత్సకు స్పందిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిన్నటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్న అతడు డాక్టర్లు పిలిచినప్పుడు తన చేయిని కదిలించడం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే మాట్లాడేందుకు కూడా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియో నిన్న రాత్రి మెడివకర్ ఆస్పత్రిలో తీసినదిగా తెలుస్తోంది.
కాగా శుక్రవారం రాత్రి జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్‌కు అంతర్గత గాయాలు లేవని తెలిపారు. డాక్టర్ అలోక్ రజంన్ నేతృత్వంలో అందిస్తున్న చికిత్సకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. కాలర్ బోన్ ఫ్యాక్చర్‌పై 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment