నెచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తోంది ఆమె. గ్లామర్ పాత్రలకు దూరం, చేసింది అరడజను సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందడం ఒక్క సాయి పల్లవికే చెందింది. స్టార్‌గా గుర్తింపు పొందేముందు ఓ నటి ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంటుంది. కానీ సాయి పల్లవి మాత్రం అలాంటి వాటికి అవకాశమే ఇవ్వదు. అంతగా తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది ఆమె.
చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం..
అలాంటి సాయి పల్లవిపై ముడేళ్ల క్రితం యంగ్ హీరో నాగశౌర్య విమర్శ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాగశౌర్య, సాయి పల్లవిలు కలిసి కణం చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్‌లో సమయంలో సాయి పల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ గతంలో నాగశౌర్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం తనపై నాగశౌర్య చేసిన వ్యాఖ్యలకు సాయి పల్లవి తాజాగా సమాధానం ఇచ్చింది. ఇటీవల సాయి పల్లవి బాడీ షేమింగ్‌కు గరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ నాగశౌర్య వ్యాఖ్యలపై కూడా స్పందించింది.
చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నా వల్ల ఎవరైన ఇబ్బంది పడ్డారంటూ నాకు బాధగా ఉంటుంది. గతంలో హీరో నాగశౌర్య నాపై ఇలాంటి కామెంట్స్ చేశాడు. అది తెలిసి నాకు చాలా బాధేసింది. కణం మూవీ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్‌ని ఫోన్ చేసి నా వల్ల ఇబ్బంది పడ్డారా? అని అడిగాను. వాళ్లు అలాంటిదేమి లేదన్నారు. నటుడిగా నాకు నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. కానీ నేను దాన్ని పాజిటివ్‌గానే తీసుకున్నాను. నిజంగా సెట్‌లో నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. ఇక ఈ నా సమాధానంతో అయిన ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment