
సాయికుమార్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రమిది. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సోమవారం (జూలై 27) సాయికుమార్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్ర ఏకాంబరం లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: జె. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా.
Comments
Please login to add a commentAdd a comment