మహిళల డ్రెస్ కోడ్ కాంట్రవర్సీపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని ,వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే వారికి అంత మంచిదని వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రసారమైన ‘ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అసలు డ్రేస్ కోడ్ వివాదమేంటి?
కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ సినిమాలో సల్మాన్‌తో కలిసి నటించిన పాలక్ తివారీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్ తన సినిమా సెట్‌లో ఉన్న మహిలందరూ నిండుగా, మెడ వరకు వస్త్రాలు ధరించేలా చూస్తారు’ అని పేర్కొంది. దీనిని నెటిజన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. సల్మాన్‌ను విమర్శిస్తూ ట్వీట్స్ చేశారు.
(చదవండి: మే తొలివారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే )
అందుకే ఆ కండీషన్ పెట్టా: సల్మాన్
తాజాగా ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ను వ్యాశ్యాత రజత్ శర్మ ఓ ప్రశ్న అడిగారు. ‘మీ సినిమా సెట్‌లోని మహిళలకు దుస్తుల విషయంలో నియమం పెట్టిన మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటిస్తారు కదా. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందికి రాదా?’ అంటూ ప్రశ్నించారు.
(చదవండి: నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య )
దీనికి సల్మాన్ ఖాన్ జవాబిస్తూ ఇందులో ద్వంద్వ ప్రమాణాలు ఏమీ లేవు. మహిళలు శరీర భాగాలు చాలా విలువైనవి అన్నదే నా అభిప్రాయం. వాటిని ఎంత ఎక్కువ దుస్తులతో సంరక్షిస్తే అంత మంచింది. ఇది మహిళల గురించి చెబుతున్న మాట కాదు, మన తల్లులు, సోదరీమణులూ, భార్య వంటి మహిళలను వక్రబుద్ధి తో చూసే కొందరిని ఉద్దేశించి చెబుతున్న మాట. దుస్తుల కారణంగా మహిళలు అవమానాలకు గురి కాకూడదని నేను కోరుకుంటున్నాను’ అని సల్మాన్ వివరించారు.
నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి
ఇదే కార్యకమ్రంలో తనకు వస్తున్న బెదిరింపులపై కూడా సల్మాన్ స్పందించారు. బెదిరింపుల కారణంగా తనకు భద్రత పెంచారని, దీంతో గతలో మాదిరి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లలేకపోతున్నానని అన్నాడు. ‘ట్రాఫిక్‌లోనూ నా చుట్టు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. భగవంతుడిపై భారం వేశా. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఉంటున్నా’ అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment