
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకుల విషయం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం(అక్టోబర్ 2) మేము.. విడిపోతున్నాం అంటూ చై-సామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే వారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనకగా కారణలు ఏంటీ? వారు ఎందుకు విడిపోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే విడాకుల అనంతరం చై, సమంతకు ఇచ్చే భరణం అంశం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చదవండి: సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్ వైరల్
ఫ్యామిలీ మ్యాన్ 2లో పలు అభ్యంతరకర సన్నివేశాల్లో సమంత నటించిన కారణంగానే చై-సామ్ మధ్య చెడిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు, విభేదాలు తలెత్తడంతో వారిని ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారట. అప్పుడు వారి మధ్య మనస్పర్థలు తొలిగినప్పటికీ కొద్ది రోజులు మళ్లీ గొడవలు మొదలైయ్యేవని, దీంతో పలుమార్లు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక అందరూ కలిసి వారికి నచ్చజెప్పి ఒకటి చేసే ప్రయత్నం కూడా చేశారట. అయినప్పటికి ఫలితం లేకపోవడంతో చివరికి ఇలా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకుల అనంతరం నాగ చైతన్య ఇచ్చే భరణం ఎంత ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
చదవండి: ChaySam Divorce Reason: సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కారణాలివేనా?
ఈ విడాకుల ప్రాసెస్‌లో భాగంగా అక్కినేని స్థిర, చర ఆస్తులను చూస్తుంటే సమంతకు భరణం కింద రూ. 250 కోట్ల రూపాయల నుంచి రూ. 300 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. కొందరూ మాత్రం రూ. 50 కోట్ల ఇచ్చే అవకాశం ఉందని అంటుండగా..మరికొందరెమో సమంత ఒక స్టార్ హీరోయిన్, ఇప్పటికే ఆమె ఎన్నో స్థిర, చర ఆస్తులను సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అలాంటి సామ్‌కు భరణం తీసుకునే అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చై నుంచి సామ్ భరణం తీసుకుంటుందా లేదా? అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఎంతవరకు భరణం ఇస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment