Russia Ukraine War: Samantha And Kajal Aggarwal Emotional Post Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha Kajal Agarwal: ఉక్రెయిన్​ పరిస్థితులపై సమంత, కాజల్​ ఎమోషనల్​ పోస్ట్​లు

Published Sat, Feb 26 2022 1:53 PM | Last Updated on Sat, Feb 26 2022 6:19 PM

Samantha Kajal Agarwal Emotional Post On Russian Ukraine War - Sakshi

Samantha Kajal Agarwal Emotional Post On Russian Ukraine War: ఉక్రెయిన్​లో జరుగుతున్న పరిణామాలపై యావత్​ ప్రపంచం నివ్వెరపోతోంది. ప్రస్తుతం రష్యా చేస్తున్న దురాగతాలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్​లో వాటిల్లిన ప్రస్తుత పరిస్థితులపై ఒక్కొక్కరూ ఒక్కోలా నిర్ధరణకు వస్తున్నారు. ఈ అంశంపై రాజకీయ నాయకులే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఉక్రెయిన్​లో జరుగుతున్న పరిణామాలపై సోనూసూద్​, గ్లోబల్​ స్టార్​ ప్రియాంక తదితరులు రియాక్ట్​ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ స్టార్​ హీరోయిన్లు సమంత, కాజల్​ అగర్వాల్​ స్పందించారు. తమ అభిప్రాయాలను సోషల్​ మీడియా వేదికగా ప్రకటించారు. 'ఒకవేళ మీరు దీన్ని చదువుతుంటే ప్రపంచంలో శాంతి కోసం ప్రార్థించండి. ఆ శాంతి అందరి మనసుల్లో, ఇళ్లల్లో, ప్రతీ భూభాగంలో నిండాలని కోరుకోండి. ప్రతీ ఒక్కరూ శాంతిగా, సంతోషంగా జీవించడానికి అర్హులు. #ఉక్రెయిన్' అంటూ సామ్​ ప్రముఖ గాయని చిన్మయి పెట్టిన పోస్ట్​ను షేర్​ చేసింది. ఇక టాలీవుడ్​ చందమామ కాజల్​ అగర్వాల్​ ఒక వీడియోను షేర్ చేస్తూ హార్ట్​ బ్రోకెన్​ ఎమోజీని క్యాప్షన్​గా పెట్టింది. ఈ వీడియోను ప్రియాంక చోప్రా షేర్​ చేయగా కాజల్​ రీపోస్ట్​ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement