సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్‌ | Samantha Pet Hash With Naga Chaitanya, Pic Viral - Sakshi
Sakshi News home page

సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. హస్‌ గురించి చైతూ కామెంట్‌

Published Wed, Oct 4 2023 7:57 AM | Last Updated on Wed, Oct 4 2023 8:43 AM

Samantha Pet Hash With Naga Chaitanya - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య విడిపోయి సుమారు రెండేళ్లు అవుతుంది. వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్తని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మళ్లీ కలుసుకోబోతున్న సమంత- చైతన్య అనే వార్తలు అప్పడప్పుడు ప్రచారంలోకి వస్తుంటాయి. ఏదైమనప్పటికి వివాహబంధాన్ని కాదనుకుని ఎవరిదారిలో వారు బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ అప్పుడప్పుడు పరోక్షంగా వారి ప్రేమ గురించి సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటారు. 

(ఇదీ చదవండి: ఆ ఆలయంలో ఒక ‍ప్రత్యేకత.. ఈసారి ఖుష్బూను వరించిన అదృష్టం)

తాజాగా నాగ చైతన్య తన దగ్గర పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరు కొత్త బైక్‌ కొని దానిపై ఆటోగ్రాఫ్‌ కావాలని చైతూను కోరడంతో ఆయన  కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి బైక్‌పై ఆటోగ్రాఫ్‌ ఇవ్వడమే కాకుండా రైడ్‌ కూడా చేశాడు. ఇదే సమయంలో అక్కడ కెమెరా కంట ఒక పెట్‌ డాగ్‌ కనిపించింది. అది అచ్చు సమంత వద్ద ఉండే 'హస్‌' మాదిరి ఉంది. అరే ఇది సమంత వద్ద కదా ఉండేది..? ఇక్కడ చైతూ ఇంటికి ఎలా వచ్చింది..? అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో వారిద్దరూ మళ్లీ కలుసుకోబోతున్నారా..? సమంత- చైతన్య ఒకరికొకరు టచ్‌లో ఉన్నారా..? అంటూ పలువురు కామెంట్లు చేయడం ప్రారంభించారు.

మరి కొందరు మాత్రం... అలాంటిది ఏం లేదంటూనే..  అచ్చు 'హస్‌' లాంటి పెట్‌ను చైతన్య తెచ్చుకున్నారని తెలుపుతున్నారు. సమంత వద్ద ఉన్న పెట్‌ ఆమె దగ్గరే ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే అసలు విషయం బయటకొస్తుంది.


-- పాత ఫోటో

పెట్‌ 'హష్‌' గురించి గతంలో నాగ చైతన్య కామెంట్‌
'థ్యాంక్యూ' సినిమా సమయంలో నాగ చైతన్య తన పెట్‌ గురించి ఇలా చెప్పాడు. 'థ్యాంక్యూ అనేది చాలా గొప్ప పదం, మనం కొన్ని సార్లు ఎక్కువగా వాడుతుంటాం.. కొందరికి మనం ఎక్కువగా చెబుతుంటాం. కొందరికి చెప్పలేం.. అయితే నా జీవితంలో ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి' అంటూ తన తల్లి, తన తండ్రి, సమంత పెట్ హష్ ఫోటోలను ఆయన గతంలో షేర్ చేశారు. అర్థం అయింది కదా..! చైతన్యకు హష్‌ అంటే ఎంత ఇష్టమో.. ఇక సమంత, నాగ చైతన్యలు కలిసి ఉన్నప్పుడు వారిద్దరూ 'పెట్‌  హష్‌'కు ఎంత అడిక్ట్ అయ్యారో అందరికీ తెలిసిందే.

చెప్పాలంటే ఆ పెట్‌ను సమంత తెచ్చుకున్నారు. మొదట్లో నాగ చైతన్యకు అంత ఇష్టం ఉండకపోయినా.. రాను రాను హష్ మీద ప్రేమ ఎక్కువైందట. ఇదే విషయాన్ని ఒక షోలో వారిద్దరూ చెప్పారు. కానీ విబేదాల వల్ల వారిద్దరూ విడిపోవడంతో  సమంత తన పెట్‌ను తాను తీసుకెళ్లారు.  ఇప్పుడు సమంత వద్ద హష్‌తో పాటుగా సాషా అనే మరో పెట్ కూడా ఉంది. తాజాగా నాగ చైతన్య ఇంటి వద్ద అచ్చు 'హస్‌' లాంటి పెట్‌ కనిపించడమే దీనంతటికి ప్రధాన కారణం అయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement