Samantha Reaction To Naga Chaitanya And Sobhita Dhulipala Dating Rumours, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha - Naga Chaitanya: ఆ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్‌.. స్పందించిన సమంత, ట్వీట్‌ వైరల్‌

Published Tue, Jun 21 2022 11:06 AM | Last Updated on Tue, Jun 21 2022 12:44 PM

Samantha Response About Naga Chaitanya And Sobhita Dhulipala Dating Rumours - Sakshi

సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్లీ ప్రేమలో పడ్డాడని, హీరోయిన్‌ శోభితా ధూళిపాలతో డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలను నాగచైతన్య ఫ్యాన్స్‌ తిప్పి కొడుతూ..‘చై ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడానికే సమంత పీర్‌ఆర్‌ టీమ్‌ ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తోంది’అని ట్వీట్స్‌ చేశారు. తాజాగా దీనిపై సమంత తనదైన శైలిలో స్పందించారు. అమ్మాయిలపై పుకార్లు వస్తే నిజమే కానీ అబ్బాయిలపై వస్తే మాత్రం అమ్మాయిలే చేయించారని ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు.

‘అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయిస్తోందంటారు. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మీరు ప్రస్తావించిన వ్యక్తులు ముందుకెళ్లిపోతున్నారు. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.  మీ పని మీద, మీ కుటుంబాల విషయాల మీద ఏకాగ్రత పెట్టండి’అని సమంత ట్వీట్‌ చేశారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ‘దూత’అనే వెబ్‌ సిరీస్‌ కూడా త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇక సమంత విషయానికొస్తే.. ఇటీవల కేఆర్‌కే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన యశోదా, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement