టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ సమంత చాలాకాలానికి అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. థియేటర్‌లో చూసిన ఫస్ట్ మూవీ ఏదని ఓ నెటిజన్ అడగ్గా జురాసిక్ పార్క్ అని జవాబిచ్చింది సామ్. అలాగే తన తొలి సంపాదన గురించి మాట్లాడుతూ... హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసినందుకు రూ.500 ఇచ్చారని గుర్తు చేసుకుంది. అమ్మాయిల కోసం ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వమని అడగ్గా.. మీపైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి అని సెలవిచ్చింది.
మరో నెటిజన్.. మీరు ఎప్పటికైనా వేసుకోవాలనుకున్న టాటూలు ఏంటో చెప్పమని అడిగాడు. దీంతో క్షణకాలం పాటు ఆలోచనలో పడిపోయిన సామ్.. తానసలు టాటూలే వేయించుకోకూడదనుకున్నానని బదులిచ్చింది. అలాంటి ఆలోచన ఉంటే తక్షణమే మానుకోమని అభిమానులకు సూచించింది. కాగా సామ్ గతంలో మూడు టాటూలు వేయించుకుంది. చైతూతో కలిసి చేసిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా వైఎంసీ అనే అక్షరాలను వీపుపై పచ్చబొట్టు వేయించుకుంది.
అలాగే నడుము పై భాగంలో చై అనే పేరును పచ్చబొట్టు వేయించుకుంది! కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకోగా ఇదే టాటూ చై చేతికి కూడా ఉంటుంది. `నీ జీవితం నువ్వు చూసినట్టుగా ఉంటుంది. ఇతరులు చూసినట్టుగా కాదు` అనే అర్థం వచ్చే సింబల్స్‌ను ఇద్దరూ తమ చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నారు. కాగా గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న చైసామ్ గతేడాది అక్టోబర్‌లో విడిపోయిన విషయం తెలిసిందే! అయితే వారు విడిపోయినా ఆ టాటూలు మాత్రం అలాగే ఉండిపోవడంతో సామ్ అలా ఆన్సరిచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్, పెళ్లి ఫొటోలు చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment