షూటింగ్‌లో గాయం.. ఫోటో షేర్‌ చేసిన సామ్‌ | Samantha Takes Needle Treatment For Her Injury, Shares Photo Trending On Social Media | Sakshi
Sakshi News home page

Samantha Injury News: గాయాలపాలవకుండా యాక్షన్‌ స్టార్‌ కాగలనా?

Published Wed, Sep 4 2024 5:00 PM | Last Updated on Wed, Sep 4 2024 5:36 PM

Samantha Takes Needle Treatment for Her Injury, Shares Photo

యాక్షన్‌ సీన్‌ చిత్రీకరణలో హీరోయిన్‌ సమంతకు గాయమైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. మోకాలికి అయిన గాయానికి సూదులతో చికిత్స తీసుకుంటున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది. గాయాలపాలవకుండా నేను యాక్షన్‌ స్టార్‌ అవగలనా? అని అని రాసుకొచ్చింది. 

సామ్‌కు గాయం
అయితే ఏ సినిమా షూటింగ్‌లో గాయపడిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే సామ్‌ చేతిలో ప్రస్తుతం బంగారం అనే మూవీ ఉంది. బహుశా ఈ సినిమా చిత్రీకరణలోనే తను గాయపడి ఉండొచ్చని తెలుస్తోంది. కాగా ఈ బ్యూటీ చివరిసారిగా ఖుషి సినిమాలో కనిపించింది. అనంతరం సిటాడెల్‌: హనీ బన్నీ అనే వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసింది. 

వెబ్‌ సిరీస్‌లో..
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా, సమంత హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. 

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement