ఈమె తెలుగు హీరోయిన్. కరెక్ట్‌గా చెప్పాలంటే ఫస్ట్ మూవీతోనే సూపర్‌హిట్ కొట్టింది. కుర్రాళ్ల డ్రీమ్ హీరోయిన్ అయిపోయింది. అలా వరసగా టాలీవుడ్‌లో ఐదు వరకు సినిమాలు చేసింది. కానీ తొలి చిత్రం రేంజులో అయితే ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీకే దూరమైపోయింది. అలా చాన్నాళ్ల తర్వాత లేటెస్ట్‌గా ఓ చోట.. తళుక్కన కనిపించింది. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు కాంచీ కౌల్. 90స్ కిడ్స్‌లోనూ మహా అయితే ఒకరో ఇద్దరికో మాత్రమే బహుశా ఈ పేరు కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే 'సంపంగి' లాంటి హిట్ మూవీలో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది గానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తమిళంలో మూడు చిత్రాల్లో ఛాన్స్ వచ్చినా సరే అవన్నీ షూటింగ్ దశలో ఆగిపోయాయి. 2004లో చివరగా హిందీలో 'వో తేరా నామ్ తా' చిత్రం చేసి.. సిల్వర్ స్క్రీన్‌కి పూర్తిగా దూరమైపోయింది.
ఇక సినిమాలకు దూరమైన తర్వాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005 నుంచి 2014 వరకు హిందీలో పలు సీరియల్స్ చేసింది. అలా బుల్లితెరపై యాక్ట్ చేస్తున్న టైంలోనే సీరియల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2014 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన కాంచీ కౌల్.. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొడుకులతో ఓ చోట కనిపించింది. ఆ వీడియో వైరల్ కాగా.. తొలుత ఈమెని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. 'సంపంగి' బ్యూటీ ఇంతలా మారిపోయిందేంటి అని అవాక్కవుతున్నారు.
(ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?)
Comments
Please login to add a commentAdd a comment