ప్రతీ ప్రేమ జంట చూడాల్సిన చిత్రం: డైరెక్టర్​ వినయ్​ | Seetharamapuramlo Oka Prema Janta Movie Wrap Up Shooting | Sakshi
Sakshi News home page

Seetharamapuramlo Oka Prema Janta Movie: ప్రతీ ప్రేమ జంట చూడాల్సిన చిత్రం: డైరెక్టర్​ వినయ్​

Published Fri, Jan 28 2022 5:08 PM | Last Updated on Fri, Jan 28 2022 6:59 PM

Seetharamapuramlo Oka Prema Janta Movie Wrap Up Shooting - Sakshi

Seetharamapuramlo Oka Prema Janta Movie Wrap Up Shooting: ప్రతీ ప్రేమ జంట చూడాల్సిన చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట' అని ఆ సినిమా డైరెక్టర్​ వినయ్​ బాబు తెలిపారు. విలేజ్ బ్యాక్​డ్రాప్​ ప్రేమకథతో శ్రీ ధనలక్ష్మీ మూవీస్​ పతాకంపై చందర్​ గౌడ్​ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట'. ఎమ్​. వినయ్​ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రణధీర్​ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్​గా తెరంగ్రేటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్​లో షూటింగ్ జరుపుకుంటోంది. జనవరి 29తో చిత్రీకరణ పూర్తవనుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు. 



సినిమా అనుకున్నదానికన్నా చాలా బాగొచ్చిందని డైరెక్టర్​ వినయ్​ బాబు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకన్నా విభిన్నంగా ఉంటుందన్నారు. ప్రేమలో ఉన్న ప్రతీ జంట చూడాల్సిన విలేజ్​ బ్యాక్​డ్రాప్​ స్టోరీ అని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా మంచి సందేశం ఇస్తున్నామని వెల్లడించారు. చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్​ వచ్చిందన్నారు. త్వరలో మరో సాంగ్​ను రిలీజ్​ చేస్తామన్నారు. సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, జనవరి 28తో షూటింగ్​ పూర్తవుతుందని వినయ్ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement