
Sehari Movie Unit Appriciates Hero Harsh Kanimulli: 'సెహరి సినిమాలో’ హర్ష్ తండ్రి పాత్ర చేశాను. హర్ష్‌లో చాలా ఈజ్ ఉంది. ‘నువ్వు నాకు నచ్చావ్’లో వెంకటేశ్ తరహాలో సహజ నటన పండించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పండగలాంటి సినిమా ‘సెహరి' అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సెహరి'. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్ విడుదల చేశారు.
దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ 'వర్క్ షాప్ సమయంలోనే హర్ష్ నటనకి అభిమానిగా మారిపోయాను. అందరి కృషితో సినిమా బాగా వచ్చింది' అన్నారు. ‘'చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ చూడదగ్గ సినిమా ఇది’' అని అద్వయ జిష్ణురెడ్డి అన్నారు. ‘'ఆద్యంతం ఎంటర్‌టైన్ చేసే సినిమా ‘సెహరి’' అన్నారు హర్ష్. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బుధవారం రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment