Sehari Movie Will Release In February: హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం సెహరి. ఈ సినిమాకు జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ ‘'యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. అన్ని రకాల వాణిజ్య అంశాలున్నాయి. హర్ష్ కనుమిల్లి చక్కని కథ అందించారు. మా సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ‘సెహరి..’ టైటిల్ సాంగ్ యూత్‌ఫుల్ ట్రాక్‌గా నిలిచింది. ‘ఇది చాలా బాగుందిలే..’ పాటలో హర్ష్ తన డ్యాన్స్‌తో, సిమ్రాన్ చౌదరి తన లుక్స్‌తో అదుర్స్ అనిపించారు' అని తెలిపారు.
ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో హర్ష్ కనుమిల్లిని వర్జిన్ స్టార్ అని బాలకృష్ణ అనడం వైరల్ కూడా అయింది. ఈ సినిమాలో అభినవ్ గౌతమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి అరవింద్ విశ్వనాథ్ కెమెరా వర్కింగ్ చేయగా ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఎడిటింగ్ బాధ్యతలను రవిరాజా గిరిజాల నిర్వర్తించారు.
Sehari Movie : సెహరి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే ?
Published Tue, Feb 1 2022 8:38 AM | Last Updated on Wed, Feb 2 2022 12:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment