సాక్షి చెన్నై: ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.తమకు కుమారుడు జన్మించాడంటూ రాఘవన్ భార్య గీతాంజలి తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అప్పుడే ఈ బుడ్డోడికి రిషికేష్ అనే పేరు కూడా పెట్టేశారు. గురువారం ఉదయం "రిషికేశ్ సెల్వరాఘవన్’’ తమ జీవితాల్లోకి ఎనలేని ఆనందాన్నితీసుకొచ్చాడంటూ గీతాంజలి ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని, తాము క్షేమంగా ఉన్నామని తెలిపారు. అలాగే తమకు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దీంతో తమిళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి విషెస్ అందిస్తున్నారు.
కాగా సెల్వరాఘవన్ తమిళ హీరో ధనుష్ సోదరుడు. 2006లో నటి సోనియా అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన సహాయ దర్శకురాలు గీతాంజలిని సెల్వ రాఘవన్ పెళ్ళి చేసుకున‍్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరికీ పిల్లలు లీలావతి, ఓంకార్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే గీతాంజలి, గత ఏడాది నవంబర్ నుంచి తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment