‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్ పరిచయమయ్యారు రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మికా రాజశేఖర్. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యారామె. సీనియర్ తమిళ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో శివాత్మిక హీరోయిన్‌గా నటించనున్నారు. నందా పెరియసామి దర్శకత్వం వహించనున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనున్నారు. లోకల్ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా కనిపించే పాత్ర శివాత్మికది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.
చదవండి: ‘తెల్లవారితే గురువారం’.. ఏం జరిగింది?
కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న దొరసాని
Published Fri, Feb 12 2021 10:54 AM | Last Updated on Fri, Feb 12 2021 11:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment