లైవ్‌లో ఫోన్‌ నెంబర్‌ అడిగిన ఫ్యాన్‌, ఆ నెంబర్‌ ఇచ్చిన శృతి హాసన్‌ | Shruti Haasan Gave 100 Helpline Number To Fan Who Asked Her Contact Number | Sakshi
Sakshi News home page

Shruti Haasan: లైవ్‌లో ఫోన్‌ నెంబర్‌ అడిగిన ఫ్యాన్‌, ఆ నెంబర్‌ ఇచ్చిన శృతి

Published Tue, Oct 5 2021 6:34 PM | Last Updated on Tue, Oct 5 2021 8:51 PM

Shruti Haasan Gave 100 Helpline Number To Fan Who Asked Her Contact Number - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాస‌న్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికతో కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతోంది. అలాగే సోష‌ల్ మీడియాలో సైతం ఆమె ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శృతి తరచూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తోంది. అలాగే నిన్న(సోమవారం) ట్విటర్‌లో లైవ్‌ చిట్‌చాట్‌ నిర్వహించిన ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

చదవండి: విడాకులపై స్పందించిన సమంత తండ్రి

ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ లైవ్‌ సెషన్‌లో భాగంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో తనకు ఎదురైన ఓ ప్రశ్నకు శృతి తనదైన శైలి సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ శృతి ఫొటో నెంబర్‌ అడిగాడు. దీనికి పోలీసు హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 100 ఇచ్చింది. దీంతో శృతి రిప్లై చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె చమత్కారానికి అందరూ ఫిదా అవుతున్నారు. సదరు నెటిజన్‌ను నొప్పించకుండా సమయ స్ఫూర్తితో వ్యవహిరించిన శృతి తీరుపై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: సొంతింటి కల నిజం చేసుకున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, ఇల్లు చూశారా?

అలాగే తనకు ఇష్టమైన ఆటగాడు ఎవరని అడగ్గా.. మైఖేల్ జోర్డాన్, సచిన్ టెండూల్కర్‌ అని తెలిపింది. కాగా ఇటీవల బాయ్‌ఫ్రెండ్ శాంతనుతో ముంబైలోని ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ఇంటి సరకుల కోసం షాపింగ్ చేయడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చింది. శృతి సంతనుతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆమె నటించిన లాభం చిత్రం ఇటీవల విడుదల కాగా, ప్రస్తుతం శృతి ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: నాగ చైతన్య-సమంతలకు అభిమానుల విజ్ఞప్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement