తమిళసినిమా: ఇటీవల చిత్తా వంటి విజ యవంతమైన చిత్రంలో నటించిన నటుడు సిద్ధార్థ్. తాజాగా మరోసారి ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి మిస్‌యూ అనే టైటిల్‌ను నిర్ణయించారు. తమిళనాడులో బ్రాండింగ్, డిజిటర్ మార్కెటింగ్ రంగాల్లో పేరు గాంచిన 7 మైల్స్ ఫర్ సెకండ్ సంస్థ అధినేత సామ్యువేల్ మ్యాధ్యూ ఈ చిత్రం ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. కాగా ఇందులో తెలుగు, కన్నడం భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న నటి ఆషికా రంగనాథ్ కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.
నటుడు జేపీ, పొన్‌వన్నన్, కరుణాకరన్, నరేన్, అనుపమ, రమ, బాలా శరవణన్, లొల్లు సభ మార న్, సస్టిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా మాప్పిళై సింగం, కళత్తిల్ సంధిప్పోమ్ వంటి సక్సెస్‌పుల్ చిత్రాల దర్శకుడు ఎన్.రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, కేజీ.వెంకటేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హీరో హీరోయిన్లకు మాత్రమే ప్రాముఖ్యత ఉండేలా కాకుండా, అందరికీ ప్రాధాన్యత ఉండేలా కథ, కథనాలు ఉంటాయన్నారు. వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రంగా మిస్‌యూ ఉంటుందన్నారు. చాలా కాలం తరువాత నటుడు సిద్ధార్థ్ పూర్తిగా ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ లవర్ బాయ్‌గా నటిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 చిత్రంలో సిద్ధార్థ్ ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment