ఇండస్ట్రీలో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు ఎవరో తెలుసా..? | Singer Parnika Interesting Facts About Uday Kiran | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీలో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు ఎవరో తెలుసా..?

Published Sun, Aug 27 2023 8:16 AM | Last Updated on Sun, Aug 27 2023 11:03 AM

Singer Parnika Interesting Facts About Uday Kiran - Sakshi

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోల‌లో ఉద‌య్ కిర‌ణ్ ఒక‌రు. లవర్‌బాయ్‌ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రల్లో నటించిన ఉదయ్‌కిరణ్‌కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్‌ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్‌ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆయనకు సంబంధించిన విషయాలు అప్పడప్పుడు సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతుంటాయి.  

(ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్‌ సపోర్ట్‌తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే)

తాజాగ ఆయన చెల్లెలు టాలీవుడ్‌లో స్టార్‌ సింగర్‌ అంటూ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో కాదు  సింగర్‌ పర్ణిక మాన్య.. ఆమె గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బాహుబలి, భీమ్లా నాయక్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా పాటలు పాడింది. కెరియర్‌ ప్రారంభంలో 'జీ తెలుగు సారేగమప'తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన సింగర్ పర్ణిక మాన్య.. ఆ తర్వాత తెలుగులో ప్లే బ్యాక్ సింగర్‌గా వరుస అవకాశాలు దక్కించుకుని మంచి గాయనిగా స్థిరపడింది. ‘అయిగిరి నందిని’ సింగిల్‌తో నెటిజన్లను పర్ణిక ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే పర్ణికకు ఉదయ్‌ కిరణ్‌ అన్నయ్య అవుతాడనేది నిజమే... తన పెద్దమ్మ కొడుకే ఉదయ్ కిరణ్ అని ఆమె గతంలో కూడా తెలిపింది. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండేదని పర్ణిక పలుమార్లు కూడా చెప్పుకొచ్చింది. అన్నయ్య పేరును ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదని కూడా ఆమె చెప్పింది. 

ఉదయ్ కిరణ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమకు దూరం కావడం చాలా దురదృష్టకరం అంటూ గతంలో పలు ఇంటర్వ్యూలలో పర్ణిక చెప్పింది. ఆమె సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. పర్ణిక మాన్య పేరుతో తన వ్యక్తగత వ్లాగ్స్‌ చేస్తుంటుంది కూడా...  దేనికైనా రెడీ, బాడీగార్డ్, రభస, కవచం సినిమాల్లోని పాటలు కూడా ఆమెకు సింగర్‌గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement