Udaykiran hero
-
'నువ్వు నేను' హీరోయిన్ అనిత ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆయనకు సంబంధించిన విషయాలు అప్పడప్పుడు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే) తాజాగ ఆయన చెల్లెలు టాలీవుడ్లో స్టార్ సింగర్ అంటూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో కాదు సింగర్ పర్ణిక మాన్య.. ఆమె గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బాహుబలి, భీమ్లా నాయక్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా పాటలు పాడింది. కెరియర్ ప్రారంభంలో 'జీ తెలుగు సారేగమప'తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన సింగర్ పర్ణిక మాన్య.. ఆ తర్వాత తెలుగులో ప్లే బ్యాక్ సింగర్‌గా వరుస అవకాశాలు దక్కించుకుని మంచి గాయనిగా స్థిరపడింది. ‘అయిగిరి నందిని’ సింగిల్‌తో నెటిజన్లను పర్ణిక ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే పర్ణికకు ఉదయ్ కిరణ్ అన్నయ్య అవుతాడనేది నిజమే... తన పెద్దమ్మ కొడుకే ఉదయ్ కిరణ్ అని ఆమె గతంలో కూడా తెలిపింది. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండేదని పర్ణిక పలుమార్లు కూడా చెప్పుకొచ్చింది. అన్నయ్య పేరును ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదని కూడా ఆమె చెప్పింది. ఉదయ్ కిరణ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమకు దూరం కావడం చాలా దురదృష్టకరం అంటూ గతంలో పలు ఇంటర్వ్యూలలో పర్ణిక చెప్పింది. ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. పర్ణిక మాన్య పేరుతో తన వ్యక్తగత వ్లాగ్స్ చేస్తుంటుంది కూడా... దేనికైనా రెడీ, బాడీగార్డ్, రభస, కవచం సినిమాల్లోని పాటలు కూడా ఆమెకు సింగర్‌గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. -
పబ్‌లో బీభత్సం...
హీరో ఉదయ్‌కిరణ్ అరెస్టు బంజారాహిల్స్: పబ్‌లోకి రానివ్వలేదని అద్దాలు ధ్వంసం చేసి.. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి బీభత్సం సృష్టించిన యువ హీరోను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మాదాపూర్‌లో ఉండే యువ హీరో ఉదయ్‌కిరణ్ (ఫ్రెండ్స్‌బుక్, పరారే ఫేం) బుధవారం రాత్రి 11.30కి జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో ఉన్న ఓవర్ ద మూన్ పబ్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో సెక్యూరిటీ గార్డులు ఉదయ్‌కిరణ్‌ను అనుమతించలేదు. దీంతో అతను ‘నేను హీరోని, నన్నే అనుమతించరా.. అంటూ సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగి అద్దాలు ధ్వంసం చేసి లోనికి తీసుకెళ్లి మద్యం సీసాలు పగులగొట్టి, కుర్చీలు ఎత్తేశాడు. దీంతో పబ్‌లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగుతీశారు. సెక్యూరిటీ గార్డులనుంచి తప్పించుకొని ఉదయ్‌కిరణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉదయ్‌కిరణ్ డ్రగ్స్ కేసులో మరో కథానాయకుడి సోదరుడు, నైజీరియన్లతో కలిసి పట్టుబడ్డాడు. తాజాగా మూడు నెలల క్రితం కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు ఉదయ్‌కిరణ్‌పై రౌడీషీట్ తెరిచారు. అంతేకాకుండా పంజగుట్ట పీఎస్ పరిధిలోని ఓ బార్బర్ షాపులో దాడి ఘటనలో ఇతనిపై కేసు నమోదైంది. సీసీఎస్‌లో కూడా ఇతనిపై మరో కేసు ఉంది. వీటికి తోడు ఇటీవల మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిగా ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. కాగా రాత్రి దసపల్లా హోటల్లో బీభత్సం సృష్టించినందుకు ఉదయ్‌కిరణ్‌పై న్యూసెన్స్ కేసుతో పాటు సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడినందుకు కేసులు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉదయ్‌కిరణ్ పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడని ఇన్స్పెక్టర్ చెప్పారు.