Udaykiran
-
పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా..
సాక్షి, వరంగల్: సరదాగా చెరువులో దిగిన ఓ విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోనిలో జరిగింది. గ్రామానికి చెందిన మారుకంటి వెంకన్న, సుకన్య దంపతులకు కూతురు ఉదయసీ్త్ర, కుమారుడు ఉదయ్‌కిరణ్ (17) ఉన్నారు. కాగా, పది నెలల క్రితం అనారోగ్యాల కారణాలతో వెంకన్న మృతిచెందగా గ్రామంలో బతుకుదెరువు లేకపోవడంతో సుకన్య పిల్లలను తీసుకుని జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లింది. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఉదయ్‌కిరణ్ ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చ దువుతున్నాడు. ఈ క్రమంలో పండుగకు సెలవులు రావడంతో తన బాబాయి కమలాకర్‌తో రేపోని వచ్చాడు. అయితే గురువారం ఉదయం ఎవరి తోడు లేకుండా చెరువు దగ్గరకు వెళ్లి సరదాగా అందులో దిగి నీట మునిగి మృతి చెందాడు. ఉదయ్‌కిరణ్ ఎంతకూ రాకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో సుమారు 3 గంటల ప్రాంతంలో గ్రామస్తుడు చెరువు వైపు నుంచి వెళ్తున్న క్రమంలో ఇయర్‌ఫోన్స్ లభించాయి. దీంతో కుటుంబీకులకు చూపించాడు. వారు చెరువులో గాలించగా ఉదయ్‌కిరణ్ మృతదేహం లభించింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇవి చదవండి: లారీ టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి.. -
ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్‌లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌తో ఉదయ్‌కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆయనకు సంబంధించిన విషయాలు అప్పడప్పుడు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ సపోర్ట్‌తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే) తాజాగ ఆయన చెల్లెలు టాలీవుడ్లో స్టార్ సింగర్ అంటూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో కాదు సింగర్ పర్ణిక మాన్య.. ఆమె గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బాహుబలి, భీమ్లా నాయక్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా పాటలు పాడింది. కెరియర్ ప్రారంభంలో 'జీ తెలుగు సారేగమప'తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన సింగర్ పర్ణిక మాన్య.. ఆ తర్వాత తెలుగులో ప్లే బ్యాక్ సింగర్‌గా వరుస అవకాశాలు దక్కించుకుని మంచి గాయనిగా స్థిరపడింది. ‘అయిగిరి నందిని’ సింగిల్‌తో నెటిజన్లను పర్ణిక ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే పర్ణికకు ఉదయ్ కిరణ్ అన్నయ్య అవుతాడనేది నిజమే... తన పెద్దమ్మ కొడుకే ఉదయ్ కిరణ్ అని ఆమె గతంలో కూడా తెలిపింది. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉండేదని పర్ణిక పలుమార్లు కూడా చెప్పుకొచ్చింది. అన్నయ్య పేరును ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదని కూడా ఆమె చెప్పింది. ఉదయ్ కిరణ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి తమకు దూరం కావడం చాలా దురదృష్టకరం అంటూ గతంలో పలు ఇంటర్వ్యూలలో పర్ణిక చెప్పింది. ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. పర్ణిక మాన్య పేరుతో తన వ్యక్తగత వ్లాగ్స్ చేస్తుంటుంది కూడా... దేనికైనా రెడీ, బాడీగార్డ్, రభస, కవచం సినిమాల్లోని పాటలు కూడా ఆమెకు సింగర్‌గా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. -
ఇన్‌స్టా పరిచయం.. పోలీస్ స్టేషన్లో పంచాయితీ
మంచిర్యాలక్రైం: వారిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. యువతీ, యువకుడి పరిచయం కాస్త స్నేహంగా మారి.. చివరికి పోలీస్‌స్టేషన్‌కు చేరిన సంఘటన జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తల్లి రాధ తెలిపిన కథనం ప్రకారం.. భూపాలపల్లికి చెందిన ఓరుగంటి ఉదయ్‌కిరణ్ మంచిర్యాలలోని హైటెక్ సిటీలో గిటార్ నేర్పిస్తుంటాడు. అతడికి ఇన్స్ట్ర్రాగ్రామ్లో ఓ యువతితో పరిచయం అయింది. వాళ్లిద్దరు కొంత కాలంగా వాట్సాప్ మెస్సేజ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకోవడంతో పాటు ఫోన్‌కాల్స్ మాట్లాడుకున్నారు. గత నెల 17న సదరు యువతి ఇంటికి రమ్మని తన కొడుకుని ఆహ్వానించిందని ఉదయ్‌కిరణ్ తల్లి రాధ ఆరోపిస్తోంది. ఇంటికి వెళ్లిన ఉదయ్‌కిరణ్‌తో యువతి సెల్ఫీలు కూడా దిగిందని అనంతరం తన మేనమామలు, తమ్ముడు, అమ్మతో కలిసి ఉదయ్‌కిరణ్‌ను బంధించి పెళ్లి చేసుకోవాలని బెదిరించడమే కాకుండా దాడి చేయించిందని ఆరోపించింది. అనంతరం ఉదయ్‌కిరణ్‌ను పోలీసులకు అప్పగించారని, పోలీసులకు తాను ఫిర్యాదు చేస్తే తిరస్కరిస్తున్నట్లు రాధ పేర్కొంది. ఈ విషయమై సీఐ ముత్తి లింగయ్యను వివరణ కోరగా ఉదయ్‌కిరణ్ తల్లి రాధ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సదరు యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్‌కిరణ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చదవండి: కొత్త నిబంధనలతో పెళ్లిళ్ళు సాధ్యమయ్యేనా? -
దెయ్యాలు వేదాలు వల్లించడమా!
సాక్షి, సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): మానవ హక్కుల కమిషన్‌ను నిర్వీర్యం చేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు కమిషన్‌లో ఫిర్యాదు చేయడం దేయాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని శాఖలను విజయవాడకు తీసుకువచ్చి మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తలను మాత్రం హైదరాబాద్‌లోనే వదిలేసి ఇప్పుడు హక్కుల గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని విన్నవించినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసి జస్టిస్ సుభాషణ్‌రెడ్డిని నియమించి కమిషన్‌కే వన్నె తెచ్చారని కొనియాడారు. -
టీడీపీ గుర్తింపును రద్దు చేయాలి
- ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల బంజారాహిల్స్(హైదరాబాద్‌సిటీ) ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించిన తెలుగుదేశంపార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదుచేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబరు 1లోని తానిషా హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు చంద్రగిరి వెంకటేశ్వరరావు, కామాచార్యులు, కార్యదర్శులు తురక లవకుమార్, కిషోర్, రంగస్వామితో కలిసి మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చూసి ఆకర్షితులైన ఓటర్లు ఓట్లు వేశారని అధికారంలోకి వచ్చాక ఆపార్టీ వాటిని అమలుచేయకుండా ప్రజలను మోసగించిందని ఆరోపించారు. ఏపీలోని రైతులందరికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తారని, నిరుద్యోగులకు రూ 2000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నారని, బీసీ కులాల కోసం వంద హామీలు ఇచ్చారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. ఆపార్టీ గుర్తింపును రద్దు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. -
చిన్నారి కిడ్నాప్..హత్య
డబ్బు కోసం దాయాది దారుణం హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట: తమ దాయాది ఆర్థిక, రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలే క అతడి కుమారుడిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని పథకం వేశారు... బాలుడిని అపహరించారు.అయితే తమ గుట్టురట్టువుతుందని భయపడి అతిదారుణంగా పసివాడి ప్రాణం తీశారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు మృతదేహానికి రాతికడిని కట్టి చెరువులో పడేశారు. హయత్‌నగర్, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ పాశవిక హత్య శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... బాటసింగారానికి చెందిన కొడిశెల పెంటయ్య స్థానిక పంచాయితీలో బిల్‌కలెక్టర్. రేషన్‌డీలర్‌గా వ్యవహరించడంతో పాటు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాడు. ఇతని భార్య మీనా పంచాయితీ వార్డు సభ్యురాలు. వీరి కొడుకు ఉదయ్‌కిరణ్ (13) పెద్దఅంబర్‌పేటలోని రాజశ్రీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇతని కుటుంబానికి, గ్రామ మాజీ సర్పంచ్, వరుసకు వదిన కొడిశెల రాధమ్మబాలరాజు కుటుంబానికి కొంత కాలంగా విరోధం ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఏర్పడిన విభేదాలు మరింత పెరిగాయి. రాధమ్మ కొడుకు కొడిశెల నవీన్ పెంటయ్య ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాడు. తడి కొడుకును కిడ్నాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజాలని నిర్ణయించుకున్నాడు. నవీన్ అదే గ్రామంలో ఉండే తనకు వరుసకు బావ భీమనపల్లి నవీన్‌కుమార్, స్నేహితుడు చెంచెల ఉపేందర్, రేపాక నర్సింహ్మలతో కలిసి ఉదయ్‌కిరణ్ కిడ్నాప్‌కు పథకం వేశాడు. ఉదయ్ గురువారం సాయంత్రం పాఠశాలనుంచి ఇంటికి వచ్చేందుకు పెద్దఅంబర్‌పేటలో బస్సు కోసం బస్టాపులో ఉండగా.. భీమనపల్లి నవీన్‌కుమార్ ద్విచక్ర వాహనంపై వచ్చాడు. బాటసింగారం వెళ్తున్నానని చెప్పి బాలుడిని తన బైక్ ఎక్కించుకున్నాడు. ఉదయ్‌ను వనస్థలిపురం పరిసరాల్లో బైక్‌పై తిప్పాడు. చీకటి పడ్డాక మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లాడు. తాను ఇంటికి వెళ్తానని బాలుడు గోల చేయడంతో తమ గుట్టు బయటపడుతుందని భయపడి టైతో విద్యార్థి గొంతు బిగించి చంపేశాడు. మృతదే హం నీటిలో తేలకుండా ఉండేందుకు రాతికడికి మృతదేహాన్ని, స్కూల్ బ్యాగును కట్టి చెరువులో పడేశాడు. బయటపడిందిలా.... ఉదయ్ చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్థానికంగా వెదకడంతో పాటు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. ఆచూకీ తెలియకపోవడంతో రాత్రి 9 గంటలకు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి విచారించారు. ఈ క్రమంలో ఉదయ్‌ను ఓ వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లడం చూశానని, మళ్లీ చూస్తే అతడిని గుర్తుపడతానని సోహెల్ అనే విద్యార్థి చెప్పాడు. బాలుడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం బి.నవీన్‌కుమార్ కిడ్నాప్ చేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలిసి బి.నవీన్‌కుమార్ పారిపోగా.. అతడిని పోలీసులు వనస్థలిపురంలో పట్టుకుని విచారించగా.. తానే ఉదయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు వెల్లడించాడు. నవీన్‌కుమార్‌ను పోలీసులు మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. నిందితుల అరెస్ట్.... బాలుడిని కిడ్నాప్ చేసి అతని తండ్రి నుంచి రూ. 10 లక్షల నుంచి 15 లక్షలు వసూలు చేయాలని కొడిశెల బాలరాజు కొడుకు నవీన్‌కుమార్, భీమనపల్లి నవీన్‌కుమార్, ఉపేందర్, రేపాక నర్సింహ్మలతో కలిసి పథకం వేశాడని వనస్థలిపురం ఏసీపీ బి.భాస్కర్‌గౌడ్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు బి.నవీన్‌కుమార్ గతంలో నకిలీ సర్టిఫికెట్లతో హోంగార్డు ఉద్యోగంలో చేరగా.. అధికారులు అతడ్ని మూడు నెలల తర్వాత తొలగించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు... బాలుడి కిడ్నాప్, హత్య నేపథ్యంలో బాటసింగారంలో శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, సూత్రధారి (మాజీ సర్పంచ్ రాధమ్మ కొడుకు నవీన్‌కుమార్) దాయాదులు కావడం. వారి ఇల్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు బందోబస్తు చేపట్టారు. నిందితులను చంపేయాలని స్థానికులు, పెంటయ్య బంధువులు వారి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు ఉదయ్‌కిరణ్ మృతదేహం గ్రామానికి తీసుకొచ్చి.. మాజీ సర్పంచ్ ఇంటి ముందు ఉంచి ఆందోళన నిర్వహించారు. కొందరు రాధమ్మ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు గ్రామపెద్దల సహాయంతో ఆందోళకారులను శాంతిపజేశారు. అనంతరం రాధమ్మ కుటుంబ సభ్యులను పోలీసులు హయత్‌నగర్ ఠాణాకు తరలించారు. అనంతరం అశ్రునయనాలతో బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు.