పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్‌ ఆధారంగా.. | Student Dies After Falling Into Pot In Warangal - Sakshi
Sakshi News home page

పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్‌ ఆధారంగా..

Published Fri, Oct 27 2023 1:16 AM | Last Updated on Fri, Oct 27 2023 2:29 PM

- - Sakshi

ఉదయ్‌కిరణ్‌ (ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: సరదాగా చెరువులో దిగిన ఓ విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రేపోనిలో జరిగింది. గ్రామానికి చెందిన మారుకంటి వెంకన్న, సుకన్య దంపతులకు కూతురు ఉదయసీ్త్ర, కుమారుడు ఉదయ్‌కిరణ్‌ (17) ఉన్నారు.

కాగా, పది నెలల క్రితం అనారోగ్యాల కారణాలతో వెంకన్న మృతిచెందగా గ్రామంలో బతుకుదెరువు లేకపోవడంతో సుకన్య పిల్లలను తీసుకుని జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఉదయ్‌కిరణ్‌ ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చ దువుతున్నాడు. ఈ క్రమంలో పండుగకు సెలవులు రావడంతో తన బాబాయి కమలాకర్‌తో రేపోని వచ్చాడు.

అయితే గురువారం ఉదయం ఎవరి తోడు లేకుండా చెరువు దగ్గరకు వెళ్లి సరదాగా అందులో దిగి నీట మునిగి మృతి చెందాడు. ఉదయ్‌కిరణ్‌ ఎంతకూ రాకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో సుమారు 3 గంటల ప్రాంతంలో గ్రామస్తుడు చెరువు వైపు నుంచి వెళ్తున్న క్రమంలో ఇయర్‌ఫోన్స్‌ లభించాయి. దీంతో కుటుంబీకులకు చూపించాడు. వారు చెరువులో గాలించగా ఉదయ్‌కిరణ్‌ మృతదేహం లభించింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవి చదవండి: లారీ టైర్‌లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement