జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్
సాక్షి, సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): మానవ హక్కుల కమిషన్‌ను నిర్వీర్యం చేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు కమిషన్‌లో ఫిర్యాదు చేయడం దేయాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని శాఖలను విజయవాడకు తీసుకువచ్చి మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తలను మాత్రం హైదరాబాద్‌లోనే వదిలేసి ఇప్పుడు హక్కుల గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలని విన్నవించినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసి జస్టిస్ సుభాషణ్‌రెడ్డిని నియమించి కమిషన్‌కే వన్నె తెచ్చారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment