
యశస్వి కొండేపూడి.. కొంతకాలం క్రితం వరకు మ్యూజిక్ ప్రేమికులకు తప్ప జనాలకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఎవరైనా ఒక్కసారి జీ తెలుగులో ప్రసారమవుతున్న జీ సరిగమప పాటల పోటీని చూస్తే ఈ పేరు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ సంగీత పాటల ప్రపంచంలో ఒక కంటెస్టెంటుగా పాల్గొన్న యశస్వి మిగతా వారితో పోలిస్తే సమ్‌థింగ్ స్పెషల్. తన గొంతు నుంచి ఎప్పుడైతే జాను సినిమాలో సూపర్ డూపర్ హిట్టయిన ‘ఏ దారెటు వెళుతున్నా..’ అనే పాట జాలు వారిందో అప్పటి నుంచి అతడికి తిరుగు లేకుండా పోయింది. అప్పటి నుంచి యశస్వి ఏపాట పాడుతాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఒక్కసారిగా ఈ కాకినాడ కుర్రోడి పేరు బుల్లితెరపై అంతలా మార్పోగింది. ప్రస్తుతం యశస్వి డాక్టర్(ఎంబీబీఎస్) విద్యను అభ్యసిస్తున్నాడు. చదవండి: మ్యూజిక్ నేర్చుకోలేదు: యశస్వి కొండేపూడి
తాజాగా యశస్వి సాక్షి ఛానల్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించాడు. తల్లిదండ్రులు సింగర్స్ అవ్వడం వల్ల నాకు మ్యూజిక్‌పై ఆసక్తి పెరిగిందని, కానీ సంగీతం నేర్చుకోలేదని తెలిపాడు. తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని, పేరు జాను(ఝాన్సీ) అని పేర్కొన్నారు. ఆమె నీ మీద ఎప్పుడైనా అలుగుతుందా అని అడగ్గా.. అప్పుడప్పుడు అలుగుతుందని, అవన్నీ మూములేనని తెలిపాడు. ఆమె కోసం పత్ర్యేకంగా ఓ పాటను అంకితం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే బయట జనాలు గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతున్నారన్నాడు.
‘జాను సినిమాలోని పాటను షో వారే పాడమని చెప్పారు. ముందుగా ఆ పాడితే మొదటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అవుతానని బయపడ్డాను. పాట మార్చమని వాళ్లకు అనేక మెయిల్స్ పంపాను. కానీ ఆ పాట నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది. హీరో శర్వానంద్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. అనేకమంది ప్రముఖులు ఫోన్‌కాల్స్ చేసి అభినందించారు. ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం. తెలుగుతోపాటు హిందీ పాటలూ పాడుతాను. సింగర్స్‌లో కార్తీక్, చిత్ర, చిన్మయి ఇష్టం. పవన్ కల్యాణ్ అంటే అభిమానం. నాకు జీవితాంతం బ్యాండ్స్ చేయడమే ఎక్కువ ఇష్టం. అవకాశాలు వస్తే పాటలు పాడుతాను’ అని తన మనసులోని మాటలను పంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment