
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ పేరు గత నాలుగైదు రోజులుగా మార్మోగిపోతోంది. సోదరి సమంత పెళ్లిలో తెగ హల్‌చల్ చేస్తున్న శోభిత అందుకు సంబంధించిన ఫోటోలను, మధుర క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో సమంత పెళ్లిలో శోభిత హల్‌చల్ అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మే కనిపిస్తోంది.
మెహందీ, హల్దీ, పెళ్లి ఫోటోలు షేర్ చేసిన శోభిత తాజాగా మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఇక ఇదే చివరిది.. ఢిల్లీలో జరిగిన రిసెప్షన్‌లో నేను కట్టుకున్న చీర ఇదే! నాకు టైఫాయిడ్ మళ్లీ వచ్చేలా కనిపిస్తోంది. అయినా సరే అదేం పట్టించుకోకుండా మూడు రకాల పానీలతో పానీపూరి తిన్నాను. ఇకపోతే నేను షేర్ చేసినవాటిలో రెండు ఫోటోలు నా ఫేవరెట్. ఒకటి సమంత క్యూట్‌గా నవ్వుతోంది. రెండోది.. నాలో తారా ఖన్నా (మేడ్ ఇన్ హెవన్ వెబ్‌సిరీస్‌లో శోభిత ధూళిపాళ పోషించిన పాత్ర) వైబ్స్ కనిపిస్తున్నాయి. కాదంటారా? నేను చేతిలో సమంత పర్సు పట్టుకున్నాను, కానీ అందులో ఏం లేదు అని రాసుకొచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా గూఢచారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శోభిత అంతకన్నా ముందు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ యాక్ట్ చేసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ శోభిత నటించింది.
Comments
Please login to add a commentAdd a comment