
సోనాల్ చౌహాన్.. తెలుగులో బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలైతే రాలేదు. అయితే వీలున్నప్పుడల్లా విదేశీ బీచ్‌లలో బికినీలతో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోంది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ఎలా జరగాలో, ఎలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావాలనుకుంటుందో చెప్పుకొచ్చింది. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని, తన పెళ్లి సాగర తీరం వేదికగా లేదా కొండ ప్రాంతంలో జరగాలని కోరుకుంటున్నానని చెప్పింది.
‘ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం.ప్రకృతిని మించిన అందం ఇంకోటి లేదు. నా వివాహం రెండు చోట్ల జరగాలని ఆశిస్తున్నాను. సాగర తీరం ఓ వేదికగా, కొండ ప్రాంతం మరో వేదికగా నా వివాహం జరగాలని కోరుకుంటున్నా. కానీ ఇప్పటి వరకు నాకు నచ్చిన వ్యక్తి తారాసపడలేదు’అని సోనాల్ సెలవిచ్చింది.