సాక్షి, ఢిల్లీ: ‘రియల్ హీరో’సోనూసూద్‌కి అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించాడు. ‘గొప్ప పరోపకారి, యాక్టర్ సోనూ సూద్‌ని కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన మద్దతుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలి’ అని సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశాడు.
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడంతో పంజాబ్ ప్రజలు అయిష్టంగా ఉన్నారని, వారికి అవగాహన కలిపించి, వాక్సిన్ వేయించుకునేలా ప్రొత్సహించేందుకే సోనూసూద్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించామని సీఎం తెలిపారు. ఇక తనను కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ నియమించినందుకు సీఎం అమరీందర్ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు సోనూసూద్. తన సొంత రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటానికి పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ ప్రచారంలో పాలుపంచుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా, లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను సోనూసూద్ సహాయం చేసిన విషయం తెలిసిందే. సొంత ఖర్చులతో వలస కార్మికలందరిని సోంతూళ్లకు తరలించాడు. అలాగే కష్టాల్లో ఉన్న చాలా మందికి ఆర్థిక సహాయం చేస్తూ ‘రియల్ హీరో’గా పేరుపొందాడు.
Happy to share that actor & philanthropist @SonuSood will be the Brand Ambassador of our #Covid19 vaccination drive. I thank him for supporting our campaign to reach out to, and protect, every Punjabi, and appeal to all to get vaccinated at the earliest. pic.twitter.com/1083v6M0FP
— Capt.Amarinder Singh (@capt_amarinder) April 11, 2021
Comments
Please login to add a commentAdd a comment