రచయిత శ్రీనివాస్ నిర్మాతగా మారారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీ సేవాలాల్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మించనున్న చిత్రానికి ‘బారసాల’ అని టైటిల్ నిర్ణయించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, నిర్మాత సాయి వెంకట్ ‘బారసాల’ టైటిల్ లోగో ఆవిష్కరించారు. ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరెడ్డి నా వద్ద దర్శకత్వ శాఖలో చేశారు. ప్రతిభ ఉన్న టెక్నీషియన్. చిన్న సినిమాలకు ఓటీటీ మంచి సపోర్ట్‌గా నిలుస్తోంది’’ అన్నారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవంతో ‘బారసాల’ తెరకెక్కించబోతున్నాను. శ్రీనివాస్‌గారు మంచి రచయిత కావడం మా సినిమాకు హెల్ప్ అవుతుంది’’ అన్నారు. ‘‘త్వరలోనే మా సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో చెబుతాం. ‘ది టైటిల్స్ ఫ్యాక్టరీ’ని స్థాపించాను.. మంచి టైటిల్స్ కోసం సంప్రదిస్తే సహాయం చేస్తాం’’ అన్నారు శ్రీనివాస్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు.
చదవండి: రాజమౌళి, ఎన్టీఆర్‌లపై హిందీ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment