సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ SSMB28 మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది అగస్ట్‌లో విడుదల కానుంది. దీని తర్వాత మహేశ్ దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళితో జతకట్టునున్న సంగతి తెలిసిందే. మహేశ్ 29వ ప్రాజెక్ట్‌గా రాబోయే ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు జక్కన్న.
చదవండి: అల్లు అర్జున్‌కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం
కాగా గతేడాది ఆయన రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి అవార్డుల పంట పండుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొడుతున్న ఈమూవీ ఆస్కార్ నామినేషన్‌లో నిలవగా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, 'లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్', సియాటెల్ ఫిలిం క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్‌ను అందుకుంది. ఈ ఏడాదికి ఆస్కార్ అవార్డు బరిలో నిలిచిన నేపథ్యంలో జక్కన్న ప్రస్తుతం ఆమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ అంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మహేశ్ బాబు మూవీ గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్ మూవీ రిలీజ్ అనంతరమే మహేశ్ బాబు సినిమాను ప్రకటించాను. అప్పటికి ఇంకా ఆర్‌ఆర్‌ఆర్ మూవీని పాశ్చాత్య దేశాల్లో ప్రదర్శించలేదు. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపొందనుంది. పదేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. జెమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా ఉండనుంది. కాబట్టి అందుకు ఈ సినిమా కోసం సీఏఏ(క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం చేసుకున్నా. దీనివల్ల ప్రపంచ సినిమాను అర్థం చేసుకోగల ప్రతిభావంతులు పరిచయమయ్యారు.
చదవండి: ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్ మలినేని
యూఎస్ ఫలిం మేకింగ్‌కు, ఇండియా ఫిలిం మేకింగ్‌కు చాలా తేడా ఉంది. అందుకే ఈ సినిమాను ఏలా చేయాలి? ఏం చేయాలి? అనేది సవాలు మారింది. ఇది ఫైనల్ చేసేందుకు ఇంకా సమయం పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం ఆయన సీఏఏతో ఒప్పందం చేసుకున్నారంటూ గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ సీఏఏ పూర్తి పేరు క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (Creative Artists Agency). ప్రతిభను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. 1975 నుంచి లాస్ ఏంజెల్స్ కేంద్రంగా ఈ ఏజెన్సీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment