దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలలో హీరోయిన్ల పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటాడు. గుర్తిండిపోయే డైలాగ్స్ చెప్పించడంతో పాటు కామెడీ చేయించి నవ్విస్తాడు. అంతేకాదు హీరోయిన్లను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాడు. అందుకే చాలామంది స్టార్ హీరోయిన్లు తివిక్రమ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు.
అయితే తివిక్రమ్ మాత్రం ఎక్కువగా తన గత సినిమాల హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తుంటాడు. గతంలో సమంతతో వరుస సినిమాలు చేసిన తివిక్రమ్.. ఇప్పుడు పూజాహెగ్డేకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ‘అరవింత సమేత వీర రాఘవ’, ‘అల..వైకుంఠపురము’ తర్వాత ముచ్చటగా మూడోసారి పూజాకు చాన్స్ ఇచ్చాడు తివిక్రమ్. మహేశ్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రంలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా, శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో బుట్టబొమ్మ సెట్‌లోకి అడుగుపెట్టబోతుంది. అందుకోసం చిత్ర యూనిట్ ఏకంగా ఒక కొత్త కారు కొనుగోలు చేస్తుందట. షూటింగ్ ఉన్నంత కాలం పూజా హెగ్డే ఈ కారులోనే వచ్చి, వెళ్తుందట. సాధారణంగా అయితే హీరోల కోసం ఇలాంటి ఏర్పాటు చేస్తారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచన మేరకు పూజా హెగ్డే కోసం కూడా ఓ లగ్జరీ కారును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ సమయంలో హీరోయిన్ కోసం ఎలాగూ ఒక కారును అరేంజ్ చేయాలి. అదేదో అద్దెకు తీసుకునే బదులు కొత్తని కొని ఇస్తే.. ఖర్చులతో పాటు పూజా హెగ్డేకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment