SSMB28: వచ్చే ఏడాది సమ్మర్‌కు రానున్న క్రేజీ కాంబో | SSMB28: Mahesh Babu ANd Trivikram Movie Hits In Theater On 2022 Summer | Sakshi
Sakshi News home page

SSMB28: 2022 సమ్మర్‌కు రానున్న క్రేజీ కాంబో

Published Sat, May 1 2021 8:03 PM | Last Updated on Sat, May 1 2021 8:55 PM

SSMB28: Mahesh Babu ANd Trivikram Movie Hits In Theater On 2022 Summer - Sakshi

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌. ప్రస్తుతం ‘సర్కారి వారి పాట’ సినిమాలో నటిస్తున్న మహేశ్‌ ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని బ్యనర్‌లో చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ అనే వర్కింగ్‌ టైటిల్‌ కూడా ఖరారైంది. దీంతో కొద్ది రోజులుగా ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28 పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై డైరెక్టర్‌ కానీ మహేశ్‌ కానీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ మూవీ అప్‌డేట్‌ కోసం ఎదురుచ్తూస్తున్న అభిమానులకు తాజాగా ఎస్‌ఎస్‌ఎమ్‌28 మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

వచ్చే ఏడాది 2022 సమ్మర్‌లో థియేటర్లోకి ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ రానున్నట్లు ఇవాళ సాయంత్రం చిత్ర యూనిట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా ఇందులో హీరోయిన్‌ ఎవరనేది స్పష్టత లేదు. ఇటీవల మహేశ్‌కు జోడికగా మరోసారి బుట్టబొమ్మ పూజా హెగ్డె నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ మూవీ షూటింగ్‌ ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఇక మహేశ్‌ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ ఇటీవల దుబాయ్‌లో ఫస్ట్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను ముగించుకుని, రెండవ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కొంతమేర  జరుపుకుంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ వాయిదా పడింది.  డైరెక్టర్‌ పరశురాం తెరక్కెక్కిస్తున్న ఈ మూవీలో మహేశ్‌కు సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది.

చదవండి: 
ఫస్ట్‌ మహేశ్‌తోనే, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో!
ఆ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తి.. త్రివిక్రమ్‌ మూవీకి బ్రేక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement