
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్-5 తెలుగు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. సెట్ నిర్మాణం, సదుపాయాల ఏర్పాటు, సెలబ్రిటీల ఎంపిక, ఇతర అంశాలకు సంబంధించిన ఎంపిక చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్ లోగోని కూడా విడుదల చేశారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే, ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
వీరిలో ముఖ్యంగా సురేఖా వాణి పేరు బాగా ప్రచారంలో ఉంది. తాజాగా బిగ్‌బాస్ ఎంట్రీ పుకార్లపై సురేఖవాణి క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్‌బాస్ షోకి వెళ్లడం లేదని, దయ చేసి ఇలాంటి తప్పుడు వార్తలను రాయకండి అంటూ.. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో సురేఖ వాణి బిగ్‌బాస్ షోకి వెళ్లడం లేదని ఓ క్లారిటీకి వచ్చేలోపే.. ఆ పోస్ట్‌ని డిలీట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది సురేఖ. పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాల్లో దాన్ని ఇన్‌స్టా సోరీ నుంచి తొలగించింది. దీంతో ఆమె బిగ్‌బాస్‌లోకి ఆమె ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది మరోసారి ప్రశ్నార్థకంగానే మారింది. ఇక అన్ని సవ్యంగా జరిగితే.. సెప్టెంబర్ 5న బిగ్‌బాస్ ఐదో సీజన్ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment