రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్(ఫైల్)
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి తల్లిదండ్రులు మంగళవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ముంబైలో రియాను విచారించిన డీర్‌డీఓ గెస్ట్‌హౌజ్‌లోనే ఆమె తల్లిదండ్రులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను సీబీఐ ప్రశ్నించడం ఇదే మొదటిసారి. తన కుమారుడిని మానసికంగా వేధించడంతోపాటు అతడి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బుని అక్రమంగా మళ్లించారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తూ బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులో రియాతోపాటు ఆమె తల్లిండ్రుల పేర్లు కూడా ఉన్నాయి. (సుశాంత్ కుటుంబంపై రియా న్యాయపోరాటం!)
సుశాంత్ కేసులో సీబీఐ ఇప్పటి వరకు రియా, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీ, పీఎ రితేష్ షాలను ప్రశ్నించింది. మంగళవారం కూడా వంట మనిషి కేశవ్, సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని, నీరజ్ సింగ్ మాజీ మేనేజర్ శృతి మోదీ కూడా విచారణ నిమిత్తం కాలినాలోని గెస్ట్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఇప్పటి వరకు సీబీఐ విచారణకు హాజరైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ను ఈ రోజు మాత్రం విచారణకు పిలవకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు షోవిక్‌ను సీబీఐ అయిదు రోజులపాటు 35 గంటలు ప్రశ్నించింది. (రియాపై వ్యాఖ్యలు: నాకైతే భయం లేదు!)
ఇదిలా ఉండగా సోమవారం వరుసగా నాలుగో రోజు రియా, ఆమె సోదరుడు సీబీఐ ఎదుట హాజరయ్యారు. అనంతరం వారు తమ నివాసానికి చేరుకోగా రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ శ్వేతా త్రిపాఠి వారి నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా రియా, అతని సోదరుడు రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ శ్వేతా త్రిపాఠిని తోసేశారు. రియా, ఆమె కుటుంబ సభ్యులతోపాటు పలువురిపై గతంలో బిహార్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వీరిని పలుమార్లు ప్రశ్నించగా ఇటీవల ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. (డబ్బు, జబ్బు గురించి సుశాంత్ టెన్షన్)
Comments
Please login to add a commentAdd a comment