
తమిళసినిమా: తమన్నా భాటియా.. ఈ పేరు ఇప్పుడూ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ గుజరాతీ బ్యూటీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఈమె తమిళంలో రజనీకాంత్ సరసన నటించిన జైలర్ ఆగస్టు 10న విడుదలకు ముస్తాబవుతోంది. అరణ్మణై –4 చిత్రం చేతిలో ఉంది. ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ గురించి బహిరంగంగా ప్రకటించడంతో ఆ టాపిక్ కొంత వాడివేడిగా సాగింది.
ఇక హిందీలో నటిస్తున్న జీ కర్దా వెబ్ సీరీస్‌నే ఇప్పుడు వార్తల్లోకి నెట్టింది. జీ కర్దా వెబ్ సీరీస్ తమన్నా లిప్‌లాక్, హద్దులు మీరిన బెడ్‌రూమ్ సన్నివేశాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. గత 2016లో ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని ప్రకటించిన తమన్నా ఇప్పుడు అలాంటి సన్నివేశాలు శ్రుతిమించి నటించడంతో ఈమెపై నెటిజన్లు దాడి పెరుగుతోంది. ఈమె నటించిన లస్ట్ స్టోరీస్–2 సీరీస్ గురువారం నెట్‌ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
దీన్ని ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న తమన్నా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇప్పుడు తన లిప్‌లాక్, బెడ్‌రూమ్ సన్నివేశాల గురించి తెగ విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొంది. కథకు అవసరం అనిపించడంతో తాను ఆ సన్నివేశాలు అలా నటించానని చెప్పింది. 2023లో కూడా ఇంకా బెడ్‌రూమ్ సన్నివేశాల గురించి విమర్శించడం ఏమిటని ప్రశ్నించింది. మొన్నటి వరకు ఇంకా పెళ్లి కాలేదని విమర్శించిన వాళ్లు ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రకటించడంతో ఈ విషయంపై విమర్శిస్తున్నారని, అసలు ఈ సమాజం ఎందుకు ఇలా తయారవుతోంది అంటూ తన శ్రుతిమించిన శృంగార భరిత నటనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment