Tamil Actor Vijay Files Complaint Against his Parents - Sakshi
Sakshi News home page

Vijay: పేరును వాడుతున్నారని తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్‌ హీరో

Published Sun, Sep 19 2021 4:34 PM | Last Updated on Sun, Sep 19 2021 4:58 PM

Tamil Actor Vijay Files Complaint Against his Parents - Sakshi

అనుమతి లేకుండా తన పేరుని వాడుతున్నారంటూ తల్లిదండ్రులతో సహా మరో 11 మందిపై కేసు పెట్టాడు  కోలీవుడ్‌ స్టార్‌ హీరో ‘ఇళయదళపతి’ విజయ్‌. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది నవంబర్‌లో విజయ్‌ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ ను రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్‌ చేయించినట్లు విజయ్‌ తండ్రి ప్రకటించాడు. పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్‌ గతంలో ప్రకటించారు. . అంతేకాకుండా విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును గానీ, ఆ ఇయక్కం పతాకాన్ని, తన ఫొటోను వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో హెచ్చరించారు. అయినప్పటికీ విజయ్‌ తల్లిదండ్రులు తన పేరును వాడుతూనే ఉన్నారు.

తాజాగా విజయ్‌ ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. దీంతో కొందరు తాము విజయ్ అభిమానులమంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా తన పేరు పొలిటికల్ మీటింగ్స్‌కి వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు .తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement