Makkal Iyakkam
-
దళపతికి ఊరట.. ‘ విజయ్’ మక్కల్ ఇయక్కం రద్దు
చెన్నై: దళపతి విజయ్‌కి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పార్టీని రద్దు చేసినట్టు ప్రకటించారు. ఈ పరిణామాలతో తండ్రి, తనయుడి మధ్య వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది. తన కుమారుడైన హీరో విజయ్ పేరిట గతంలో దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ మక్కల్ ఇయక్కంను ఏర్పాటు చేశారు. అభిమాన సంఘాల్ని ఏకం చేసి విజయ్ మక్కల్ ఇయక్కం గొడుగు నీడలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే సమయంలో తనయుడిని రాజకీయాల్లోకి తీసుకు రావడమే లక్ష్యంగా చంద్రశేఖర్ వ్యూహాలకు పదునుపెట్టారు. అయితే, తండ్రి వ్యూహాలకు చిక్కకుండా విజయ్ జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ తన పేరిట తండ్రి చంద్రశేఖర్ ఓ పార్టీని ప్రకటించడం విజయ్ లో ఆగ్రహాన్ని రేపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి విజయ్ అభిమాన సంఘం నేతలు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీశాయి. ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చిన తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభతో పాటుగా 11 మందిపై హైకోర్టులో విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు ఇకపై తన పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓ కీలక తీర్మానం చేశామని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ మేరకు విజయ్ మక్కల్ ఇయక్కంను రద్దు చేసినట్టు ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్ తదుపరి విచారణ అక్టోబరు 29కి వాయిదా పడింది. చదవండి: పేరును వాడుతున్నారని తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో -
షాకింగ్.. తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో
అనుమతి లేకుండా తన పేరుని వాడుతున్నారంటూ తల్లిదండ్రులతో సహా మరో 11 మందిపై కేసు పెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది నవంబర్‌లో విజయ్ అభిమాన సంఘాల సమాఖ్యగా ఉన్న విజయ్ మక్కల్ ఇయ్యకమ్ ను రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించినట్లు విజయ్ తండ్రి ప్రకటించాడు. పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్ గతంలో ప్రకటించారు. . అంతేకాకుండా విజయ్ మక్కల్ ఇయక్కం పేరును గానీ, ఆ ఇయక్కం పతాకాన్ని, తన ఫొటోను వాడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో హెచ్చరించారు. అయినప్పటికీ విజయ్ తల్లిదండ్రులు తన పేరును వాడుతూనే ఉన్నారు. తాజాగా విజయ్ ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. దీంతో కొందరు తాము విజయ్ అభిమానులమంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా తన పేరు పొలిటికల్ మీటింగ్స్‌కి వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు .తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టారు. -
వైగో ఒంటరేనా?
మిత్రుడ్ని దూరం పెట్టారు వైగోకు ఆహ్వానం కరువు 28న పుదుచ్చేరిలో వీసీకే మహానాడు చెన్నై : నలుగురు మిత్రుల మధ్య పాత నోట్ల రద్దు చిచ్చును రగిల్చింది. మోదీకి జై అని మద్దతు పలికిన మిత్రుడ్ని దూరం పెట్టేందుకు మిగిలిన వారు సిద్ధమయ్యారు. ఇందులో ఓ మిత్రుడు మరో అడుగు ముందుకు వేసి, తమ మహానాడుకు రావద్దన్నట్టుగా ఆహ్వానం పంపించే ప్రసక్తే లేదని బహిరంగంగానే తేల్చారు. ఇది మక్కల్ ఇయక్కంలోని సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేల నేతల మధ్య కలిగిన మనస్పర్థల ఎపిసోడ్. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని మక్కల్ ఇయక్కం(ప్రజా సంక్షేమ కూటమి) వర్గాలు జబ్బలు చరిచిన విషయం తెలిసిందే. తాము ఆరుగురం అంటూ అధికార పగ్గాలు చేపట్టేసినట్టుగా సీఎం పదవిలో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను కూర్చోబెట్టినట్టుగా, తాము మంత్రులు శాఖల్ని పంచుకున్నట్టుగా ఎన్నికల ప్రచారం సమయంలో వీరి వాగ్ధాటికి హద్దే లేదు. అందుకు తగ్గట్టుగానే ప్రజలు ఆ కూటమి అడ్రస్సును గల్లంతు చేశారు. సీఎం పదవికి ఆశపడి చివరకు డిపాజిట్ కూడా దక్కని దృష్ట్యా, డీఎండీకే అధినేత విజయకాంత్, ఉనికి చాటుకునే ప్రయత్నంలో రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారడంతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తీవ్రంగానే పశ్చాత్తాపం పడక తప్పలేదు. ఈ ఇద్దరు కూటమికో దండం అంటూ బయటకు వచ్చేయడంతో సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేలతో కూడిన నలుగురు మిత్రులు స్నేహ మంటే మాదేరా...అని డ్యూయెట్లు పాడుకుంటూ వచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించేది తామేనని రోడ్డెక్కి గళాన్ని వినిపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత నోట్ల రద్దు నిర్ణయం మిత్రుల్లో తొలుత ఆగ్రహాన్ని తెప్పించాయి. ముక్త కంఠంతో ఖండించారు. రోజులు గడిచే కొద్దీ ఏమి జరిగిందో ఏమోగానీ, మోదీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎండీఎంకే నేత వైగో ఒక్కసారిగా మద్దతు పలకడమే కాదు, శభాష్ అని భుజం తట్టేంతగా ప్రశంసల్లో ముంచేయడం సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్లకు మింగుడు పడలేదు. ఇక, ఇయక్కం కనుమరుగైనట్టే అన్నంతంగా వ్యాఖ్యలు తూటాలు పేలాయి. అయితే, తమ మిత్ర బంధం మాత్రం పథిలం అని ఆయా నేతలు స్పందించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తాజాగా, వైగో ఇక ఒంటరి అన్నట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. మిత్రుడ్ని దూరం పెట్టారు : నోట్ల రద్దు వ్యవహారంలో అభిప్రాయ భేదాలు ఉన్నా, ఏ కార్యక్రమం జరిపినా, జరిగినా, మిత్రులకు ఆయా పార్టీల నుంచి తప్పకుండా ఆహ్వానాలు పలకడం జరుగుతూ వచ్చాయి. అధినేతలు హాజరు కాకున్నా, ఎవరో ఒకరు తప్పకుండా హాజరయ్యే వారు. అయితే, ఈ సారి ఏకంగా మిత్రుడ్ని దూరం పెట్టేందుకు మిగిలిన ముగ్గురు సిద్ధమైనట్టున్నారు. ఇందుకు ఇటీవల కాలంగా వైగో వ్యవహరిస్తున్న తీరు కారణంగా పరిగణించినట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ఈనెల 28వ తేదీన పుదుచ్చేరి వేదికగా వీసీకే మహానాడు జరగనుంది. ఇందులో నోట్లరద్దు, కొత్త నోట్ల కోసం జనం పడుతున్న పాట్లపై కేంద్రం మీద దుమ్మెత్తి పోసే విధంగా నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. తమ మహానాడుకు హాజరు కావాలని స్వయంగా వీసీకే నేత తిరుమావళవన్ రాజకీయ పక్షాలకు ఆహ్వానం పలికే పనిలో పడ్డారు. తమ మిత్రులు సీపీఎం, సీపీఐలకు ఆహ్వానం ఉందని, అయితే, ఎండీఎంకే నేత వైగోను ఈ మహానాడుకు ఆహ్వానంచడం లేదని ప్రకటించడం చర్చకు దారి తీసింది. వైగోను ఆహ్వానంచడం ఇష్టం లేదన్నట్టుగా తిరుమా స్పందించడం, ఇందుకు మిగిలిన మిత్రులు మౌనం వహించడం బట్టి చూస్తే, ఇక మిత్రుడ్ని దూరం పెట్టినట్టేనా..? అన్నది స్పష్టం కాక తప్పదేమో..! -
విమర్శలా?
► అర్థం చేసుకోవాలి ► వైగో గారడీ ► ఇయక్కంలో చీలిక తథ్యమా ►వామపక్షాల ఐక్యతకు ► టి పాండియన్ పిలుపు సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కంలో అంతర్గత సమరం రచ్చకెక్కుతోంది. ఆ ఇయక్కంకు కన్వీనర్‌గా ఉన్న వైగోకు వ్యతిరేకత ఏర్పడుతోంది. విజయకాంత్‌ను వైగో విమర్శిస్తే, వామపక్షాలు మద్దతుగా నిలవడం చర్చకు దారి తీశాయి. ఈ సమయంలో తానెప్పుడు విజయకాంత్‌ను విమర్శించానన్నట్టుగా వైగో పెదవి విప్పడం గమనించాల్సిందే.. ఎండీఎంకే నేత వైగో కన్వీనర్‌గా వీసీకీ, సీపీఎం, సీపీఐలతో మక్కల్ ఇయక్కంలో కొద్ది రోజులుగా సాగుతున్న వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ఆ ఇయక్కంకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న వైగో తీరును పరోక్షంగా మిత్రులే విమర్శించే పనిలో పడ్డారు. వైగోకు కన్వీనర్ పదవి అవసరమా..? అని సీపీఎం సీనియర్ నేత రంగరాజన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో వైగో నోరు జారడం చర్చకు దారి తీసింది. ఆ ప్రశ్నకు సమాధానానికి దాట వేత ధోరణి అన్నట్టుగా తన గురి డీఎండీకే అధినేత విజయకాంత్మీద మరల్చారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని వైగో చేసిన వ్యాఖ్యలకు విజయకాంత్ సతీమణి ప్రేమలత తీవ్రంగానే స్పందించడమే కాకుండా, ఎదురుదాడికి దిగారు. ఈ సమయంలో సీపీఎం, సీపీఐ నేతలు విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదన్నట్టు స్పందించడం చూస్తే, ఇయక్కంలో అంతర్గత సమరం తారా స్థాయికి చేరిందన్నది స్పష్టం అవుతోంది. వీసీకే నేత తిరుమావళవన్ పైపైకి ఇయక్కంలో అందరం కలిసే ఉన్నామని చెబుతున్నా, లోలోపల ఆయన కూడా మదన పడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వైగో తీరుతో మున్ముందు మరింత ఇరకాటంలో పడడం కన్నా, ఇయక్కం అన్నది లేకుండా చేస్తే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే విధంగా సీపీఐ మాజీ రాష్ట్రకార్యదర్శి టి.పాండియన్ స్పందిస్తూ బలపడాలంటే, ముందుగా వామపక్షాలు ఏకమై, ముందుకు సాగాలని పిలుపునివ్వడం గమనించాల్సిన విషయం. అదే సమయంలో విజయకాంత్‌ను పరోక్షంగా ఆయన కూడా వెనకేసుకు రావడంతో వైగో మేల్కొన్నట్టున్నారు. తానెప్పుడు విజయకాంత్‌ను విమర్శించానని మాటల గారడి ప్రదర్శించడం గమనార్హం. కళింగపట్నంలో సోమవారం మీడియాతో మాట్లాడిన వైగో, ప్రేమలత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్టుందని సూచించారు. తాను విజయకాంత్‌ను విమర్శించనేలేదని, రెండున్నర గంటల ఇంటర్వ్యూలను పూర్తిగా చూసి అర్థం చేసుకోవాలేగానీ, సహోదరి తప్పుగా భావించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. -
ఏ పార్టీకీ మద్దతు లేదు
సినీ హీరో విజయ్ చెన్నై: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓట్లు రాబట్టుకోవడానికి ఎవరికి వారు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రేక్షక ఆకర్షణ మెండుగా గల సినీ తారలను ఉపయోగించుకోవడంలోనూ ఆయా పార్టీలు తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తారలు తమకు అనుకూల పార్టీల తరఫున ప్రచారాల్లో ముని గిపోయారు. చెన్నైలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంత అభిమానులు కలిగిన హీరో విజయ్. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. విజయ్ అభిమానులు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అఖిల భారత ఇళయదళపతి విజయ్ మక్కళ్ కట్చి సోమవారం ఒక ప్రకటన విడుదల చేయడం విశేషం. అందులో విజయ్ మక్కళ్ కట్చి రాను న్న శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపకుండా మధ్యంతరంగా వ్యవహరిస్తుందన్నారు. ఒక పార్టీకి విజయ్ అభిమానులు మద్దతు ఇస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఆయన అభిమానులు ఎవరికి ఇష్టమైన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చుని తెలిపారు. అయితే విజయ్ పేరును గానీ, ఇయక్కమ్ పేరును గానీ వాడరాదన్నారు. అలా వాడుకుంటే ఇయక్కమ్ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఇక ‘నా దారి రహదారి...బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే’..అంటూ తన డైలాగులతో వెండితెరపై ప్రత్యర్థులను దడదడలాడించే సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా ఇంతవరకూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన దారెటో చెప్పనే లేదు. తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనాకర్షణ మెండుగా ఉండే సినీతారల మద్దతు కోసం అన్ని పార్టీలూ వెంపర్లాడుతాయి, వెంటపడతాయి. 1996 ఎన్నికల సమయంలో ఈ సినీ మోజు ఆకాశాన్ని అంటింది. తమిళనాడులో అత్యధిక జనాకర్షణ నటుల్లో ఆనాటి ఎంజీ రామచంద్రన్ తరువాత నేటి రజనీకాంత్ అని ఒప్పుకోక తప్పదు. ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ వైఖరి ఏమిటనే చర్చ ఆయన అభిమానుల్లో నలుగుతోంది. 20 ఏళ్ల క్రితం డీఎంకే, తమాకా వలెనే నేడు పీఎంకే తరఫున ప్రయత్నాలు సాగిన సఫలం కాలేదు. రజనీకాంత్ ఆదేశాల మేరకు ఆయన అభిమానులు సైతం పార్టీల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం.