
సినిమా ఇండస్ట్రీలో వారసులకు లెక్కేలేదు. సంగీత రంగంలోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ లిస్టులో యువ సంగీత దర్శకుడు అమర్గీత్ చేరాడు. తమిళంలో పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సౌందర్యన్ పేరు వినగానే చేరన్ పాండియన్, సింధూనదిపూ, గోపురం దీపం వంటి పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఆయన వారసుడే అమర్గీత్.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్!)
అమర్గీత్ సంగీతమందించిన యానిమేషన్ చిత్రం గుండాన్ చట్టీ.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా యంగ్ మ్యూజిషీయన్ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తన తండ్రి ఎలాంటి సలహాలు ఇవ్వకపోయినా ఆయన ద్వారా తాను చాలా నేర్చుకున్నానని చెప్పాడు. గుండాన్ చట్టీ విడుదలకు ముందే రెండు చిత్రాలు ఒప్పుకున్నట్లు చెప్పాడు.
తన తొలి సినిమాకే ప్రముఖ గీత రచయిత వైరముత్తు రాసిన పాటకు బాణీలు కట్టడం మర్చిపోలేని అనుభవమని అమర్గీత్ చెప్పుకొచ్చాడు. తనకు ఈ రంగంలో ఏఆర్ రెహమాన్ స్పూర్తి అని, చిన్నప్పటి నుంచి అనిరుధ్ పాటలు వింటూ పెరగడంతో ఆయన సంగీతం అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!)