
సీనియర్ సినీ నిర్మాత ఎస్‌ఏ రాజ్‌కన్ను (77) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. రాజ్‌కన్ను అమ్మన్ క్రియేషన్స్ పతాకంపై కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిలతో '16 వయదినిలే' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఆ చిత్రం ద్వారా భారతీరాజాను దర్శకుడిగా పరిచయం చేశారు.
అదే విధంగా కిళక్కు పోగుం రైయిల్ చిత్రం ద్వారా నటి రాధికను పరిచయం చేసిన ఘనత ఈయనదే. నటుడు కె.భాగ్యరాజ్ విలన్‌గా నటించిన 'కన్నె పరువత్తిలే', కార్తీక్, రాధ జంటగా భారతీరాజా దర్శకత్వంలో 'వాలిభమే వావా', పటుడు పాండియన్, రేవతి జంటగా నటించిన 'పొన్ను పుడిచ్చిరిక్కు', కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో 'ఎంగ చిన్న రాసా' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ఈయన మృతిక నటుడు కమలహాసన్, నటి రాధిక, దర్శకుడు భారతీరాజా మొదలగు పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా రాజ్‌కన్ను భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం చైన్నె క్రోంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment