
తమిళసినిమా: సినిమా అనుభవం ఉన్న ఎవరైనా తొలి తమిళ సినీ సూపర్‌స్టార్ ఎవరంటే పేరు టక్కున చెప్పే పేరు ఎం.కె త్యాగరాజ భాగవతార్. ఆయన్ని ఇండస్ట్రీలో ఎంకేటీ అని పిలిచేవారు. త్యాగరాజ భాగవతర్ నటించిన హరిదాసు చిత్రం 1944లో దీపావళి సందర్భంగా విడుదలై మూడేళ్ల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఆ కాలంలో ప్రఖ్యాతి గాంచిన నటుడు త్యాగరాజ భాగవతార్. అలాంటి గొప్ప నటుడు తన 49వ ఏటనే అంటే 1959వ లో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.
గత బుధవారం త్యాగరాజ భాగవతర్ 114వ జయంతి. ఈ సందర్భంగా నటుడు, దర్శకుడు పార్థిబన్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన పేర్కొంటూ.. ‘తమిళనాడు తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొంది రాజభోగాలు అనుభవించిన నటుడు త్యాగరాజ భాగవతార్. పన్నీరుతో స్నానమాడి, కన్నీళ్లతో ముఖం తుడుచుకున్న నటుడు. చివరి దశలో దుర్భర జీవితం అనుభవించారు. ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించడానికి కథా, కథనాలను కూడా సిద్ధం చేశాను‘ అని తెలిపారు.
త్యాగరాజ భాగవతార్ బయో పిక్‌ను ఎప్పుడు తీస్తారు? అన్న ప్రశ్నకు పార్థిబన్ బదులిస్తూ కథ, స్క్రీన్‌ప్లే కూడా సిద్ధం చేశానని, అయితే బయోపిక్‌లను, పిరియడ్ కథా చిత్రాలను సాధారణ బడ్జెట్‌తో రూపొందించడం సాధ్యం కాదని, భారీ బడ్జెట్ అవసరం అవుతుందన్నారు. అలాంటి నిర్మాత లభించినప్పుడు త్యాగ రాజ భాగవతర్ బయోపిక్‌ను కచ్చితంగా తెరకెక్కిస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment