
వైవిధ్యమైన కథలతో సినిమాలను అందించడంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. డిఫరెంట్ జానర్‌లో ఆయన దర్శకత్వంలో వచ్చిన అ!, కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హను-మాన్ అనే మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించి ఫస్ట్‌లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. తెలుగులో తొలి సూపర్ హీరో సిరీస్‌గా ఫిక్షనల్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరపుకుంది. నిర్మాత సి కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయై తేజకు క్లాప్ కొట్టారు. రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంపై వచ్చే నెలలో ప్రకటన వెలువడనున్నట్లు ఈ సందర్భంగా మూవీ యూనిట్ వెల్లడించింది. ఇక ప్రశాంత్ వర్మ సైతం సజ్జాతో దేవుడి ముందు దండం పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ ‘మేమిద్దరం’ మరోసారి అంటూ ట్వీట్ చేశాడు. ప్రైంషో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మిగతా నటీనటుల వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ స్పషం చేశారు. అయితే ఇప్పటికే తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ‘జాంబీరెడ్డి’ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జాంబీల నేపథ్యంలో తెలుగులో తొలిసారిగా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది.
మేమిద్దరం.. మరోసారి! 💪🏼#HanuManTheOrigin pic.twitter.com/aek2JVaXHv
— Prasanth Varma (@PrasanthVarma) June 25, 2021
Comments
Please login to add a commentAdd a comment