Tragic Life Story of Glamorous Actress Nisha Noor Who Died of AIDS After Forced Prostitution - Sakshi
Sakshi News home page

Nisha Noor Tragic Life Story: గ్లామర్‌ హీరోయిన్‌.. నిర్మాత ఒత్తిడితో వ్యభిచార కూపంలోకి.. చివరకు గుర్తుపట్టలేని స్థితిలో..

Published Wed, Jul 12 2023 11:26 AM | Last Updated on Thu, Jul 13 2023 8:16 AM

Tragic Life Story of Glamorous Actress Nisha Noor Who Died of AIDS After Forced Prostitution - Sakshi

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయాజాలం. ఇందులో ఎత్తుకు పైఎత్తులు వేసే టక్కరితనం ఉండాలి. అవకాశాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకునే నేర్పరితనం ఉండాలి. అన్ని ఆటంకాలను అధిగమించగల సత్తా ఉండాలి. అలా అయితేనే సినీరంగంలో కొనసాగించగలరు, రిటైర్‌మెంట్‌ తీసుకున్నా దర్జాగా బతకగలరు. లేదంటే నానా అగచాట్లు తప్పవు.

పేరు, ప్రఖ్యాతలున్నప్పుడు ఆహా, ఓహో అని అందరూ చప్పట్లు కొడతారు. లైమ్‌లైట్‌ నుంచి దూరమయ్యాక సాయం చేయమని చేతులు చాచి అర్థించినా ఏ ఒక్కరూ ముందుకు రారు. ఇటువంటి దీన స్థితిలో తప్పటడుగులు వేసింది గ్లామర్‌ డాల్‌ నిషా నూర్‌. నటనను నమ్ముకున్న ఆమె ఆ తర్వాత దిక్కు తోచని పరిస్థితిలో ఒళ్లు అమ్ముకుంది. అసలు ఎవరీ నిషా నూర్‌ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి..

స్టార్‌ హీరోలతో సినిమాలు..
1980లో నిషా నూర్‌ తన గ్లామర్‌తో వెండితెరను మరింత కలర్‌ఫుల్‌గా మార్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. బాలచంద్రన్‌, విసు, చంద్రశేఖర్‌, భారతీరాజా వంటి గొప్పగొప్ప డైరెక్టర్లతో పని చేసింది. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, భాను చందర్‌ వంటి బడా స్టార్స్‌తోనూ కలిసి నటించింది. కమల్‌తో 'టిక్‌ టిక్‌ టిక్‌'.. రాజేంద్రప్రసాద్‌తో 'ఇనిమై ఇదో ఇదో'.. రజనీకాంత్‌తో 'శ్రీ రాఘవేంద్ర'.. మమ్ముట్టితో 'అయ్యర్‌ ద గ్రేట్‌'.. మోహన్‌లాల్‌తో 'దేవసురమ్‌' వంటి పలు చిత్రాలు చేసింది.

సినిమాల్లేక వక్రమార్గంలో..
తన అందచందాలకు యూత్‌ దాసోహమైంది. కానీ 1995 తర్వాత నిషా నూర్‌కు ఒక్కటంటే ఒక్క ఛాన్స్‌ కూడా రాలేదు. స్టార్‌డమ్‌ స్టేటస్‌ను అనుభవించిన ఆమె అవకాశాల కోసం తల్లడిల్లింది. అయినా ఏ ఛాన్సూ రాకపోవడంతో సినిమాలు వదిలేసింది. సంపాదించుకున్నదంతా కరిగిపోసాగింది. బతకడానికి ఏదో ఒక పని చేయాలిగా.. అందుకోసం ఆమె వక్రమార్గాన్ని ఎంచుకుంది. వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఓ నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇకపోతే సినీ పరిశ్రమ నుంచి ఆపన్నహస్తం లేకపోవడంతో ఈ వృత్తిలోనే కొనసాగింది.

ఎయిడ్స్‌తో బక్కచిక్కి
ఒకానొక సమయంలో తలదాచుకోవడానికి చోటు లేక ఓ దర్గా వెలుపల నిద్రించింది. అప్పటికే ఆమె బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. నిషా దీన స్థితిని గమనించిన ఓ తమిళ ఎన్జీవో ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించగా అప్పటికే ఎయిడ్స్‌ ఉన్నట్లు తేలింది. ఎయిడ్స్‌తో పోరాడుతూ 2007లో ఆస్పత్రిలో అనాధలా కన్నుమూసింది నిషా నూర్‌.

చదవండి: ఆ హీరోయిన్‌ వల్లే విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: నటి, సింగర్‌
ప్రాజెక్ట్‌ కె యూనిట్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement