ప్రస్తుతం సోషల్‌మీడియాలో దేశవ్యాప్తంగా ఒక వార్త వైరల్ అవుతుంది. డ్రైవర్ లేకుండానే కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు గూడ్స్ రైలు పరుగులు తీసింది. గంటకు సుమారు 80 కిలామీటర్ల వేగంతో దూసుకెళ్లింది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. దీంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్‌పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదీ సంగతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అన్‌స్టాపబుల్ పేరుతో సినిమా .. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కథ
ఇలాంటి సంఘటనతో ముందే ఒక సినిమా వచ్చిందని తెలుసా.. అన్‌స్టాపబుల్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా అచ్చు ఇలానే జరుగుతుంది. ఎంతో ఉత్కంఠతో సాగే ఈ సినిమా 2010లో విడుదల అయింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా టోనీ స్కాట్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక ట్రైన్ చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం జరిగిన సంఘటన మాదిరే.. అన్‌స్టాపబుల్ సినిమా కథ ఉంటుంది. ఇందులో కూడా ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పొరపాటు వల్ల ట్రాక్ నుంచి కదిలిన ట్రైన్ ఆటోమెటిక్‌గా వెళ్లిపోతుంది.
ఆ ట్రైన్‌లో ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు జరిగితే భారీ విధ్వంసం జరగడం ఖాయం. లోకో పైలట్ లేకుండానే వేగం పెంచుకుంటూ గంటకు 100 కిలోమీటర్లతో దూసుకెళ్తుంది. ఆ సమయంలో ఎదురుగా 150 మంది పిల్లలతో ఒక ట్రైన్ వస్తుంది. ఇలాంటి సమయంలో ఆ విద్యార్థులు ఎలా బయటపడ్డారు..? అనే సీన్స్ నరాలు తెగె ఉత్కంఠతను పెంచుతాయి. ఆ తర్వాత ట్రాక్‌పై ప్రమాదానికి గురైన ఒక లారి పడి ఉంటుంది.. అప్పుడేం జరుగుతుంది..?
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
ఈ ఘటన దాటిన తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ వేగం తగ్గించుకోవాలి కానీ అందులో లోకో పైలట్ లేడు.. వేగం తగ్గకపోతే విధ్వంసమే.. ఆ సమయంలో డైరెక్టర్ మలుపు తిప్పిన ట్విస్ట్ ఏంటి..? చివరకు టన్నుల కొద్ది కెమికల్స్‌తో ఉన్న ఆ ట్రైన్‌ను ఎలా ఆపారు.. ఆ సమయంలో జరిగిన సీన్స్ తలుచుకుంటే మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రాణాలతో చెలగాటం లెక్క ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. చూడకుంటే చూసేయండి మిమ్మల్ని మరో ప్రపంచంలోకి పక్కాగ తీసుకెళ్తుంది. ఫైనల్ ట్విస్ట్ ఎమిటంటే ఇది రియల్ సంఘటన అని కొన్ని అమెరికన్ పత్రికలు ప్రచురించాయి.
78 km without driver. Goods train ran over: Forgot to start and apply handbrake; Train reached Punjab from Jammu, stopped by placing wooden stopper#Train pic.twitter.com/dDIj7G78py
— Dushyant Kumar (@DushyantKrRawat) February 25, 2024
Comments
Please login to add a commentAdd a comment