త్రిషకు చేదు అనుభవం, హర్టయిన ఫ్యాన్స్‌ | Trisha 60th Movie Paramapadham Vilayattu Takes OTT Without Inform Her | Sakshi
Sakshi News home page

త్రిషకు చేదు అనుభవం, హర్టయిన ఫ్యాన్స్

Published Sat, Mar 20 2021 10:59 AM | Last Updated on Sat, Mar 20 2021 1:35 PM

Trisha 60th Movie Paramapadham Vilayattu Takes OTT Without Inform Her - Sakshi

తెలుగుతో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని హీరోయిన్‌గా ఎదిగారు త్రిష. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసన నటించిన ఆమె ఆ తర్వాత సినిమాలకు కాస్తా బ్రేక్‌ ఇచ్చింది ఈ భామ. ఇటీవల తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతితో తమిళంలో ‘96’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్కడ సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ మూవీతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌  స్టార్ట్‌ చేసిన త్రిష ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపై మొగ్గుచుపుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ క్రమంలో ఏడాది క్రితం ‘పరమపథం విలయాట్టు’ అనే మూవీలో నటించింది. ఆమె 60 చిత్రమైన ఈ మూవీద దర్శకుడు తిరుగ్ననం 24 ఫ్రెమ్స్ ప్రొడక్షన్‌లో తెరకెక్కించాడు. ఇందులో త్రిష డాక్టర్‌గా కనిపించనుంది. అయితే లేడి ఓరియంటేడు సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఆమె ఆశలు పెట్టుకుంది త్రిష. ఏడాది కింద‌టే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే కరోనా వైరస్ కారణంగా విడుదల కాలేదు. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి ఈ సినిమాను నిర్మాతలు థియేటర్‌లోనే విడుదల చేస్తారని అనుకుంటున్న తరుణంలో ఓటీటీకి ఇచ్చేశారు. త్వరలో ఈ మూవీ డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా ఎంత ఆలస్యమైన థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారని ఆమె అభిమానులంతా అనుకున్నారు.

అయితే ఈ విషయం తనతో చెప్పకుండానే దర్శక నిర్మాతలు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో త్రిష హర్ట్‌ అయినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మూవీలో త్రిష నటన అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని.. థియేటర్లో విడుదల అయితే తన కెరీర్‌కి ఇది చాల హెల్ప్ అయ్యేందని ఆమె అభిమానులు బాధపడిపోతున్నారు. ఈ మూవీతో తనెంటో నిరుపించుకోవాలనుకున్న త్రిషకు ఇది నిజంగా చేదు అనుభవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాతో పాటు త్రిష  మణిరత్నం తెరకెక్కిస్తున్న  పీరియడ్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్‌తో బిజీగా ఉంది . ఈ చిత్రంలో త్రిష చోళ యువరాణి కుందవై పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

చదవండి: 
ఇటలీలో వయ్యారాలు ఒలకబోసిన అనసూయ.. వీడియో వైరల్
లూసిఫర్‌: మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement