కరోనా పుట్టిస్తున్న వేవ్స్‌తో, టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువగా నేచురల్ స్టార్ నాని ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది నాని నటించిన ‘వీ’ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యేలా చేసింది ఈ మాయదారి మహమ్మారి. ఆ ఎఫెక్ట్ తో టక్ జగదీష్ ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటున్నాయి. ఈ దశలో జులై 30న ఇష్క్, తిమ్మరుసు లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదే జోష్ లో టక్ జగదీష్ కూడా న్యూ రిలీజ్ డేట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం సాగింది. జులై 30నే టక్ జగదీష్ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడని టాక్ వినిపించింది. కాని యూనిట్ ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఇప్పుడుఆగస్ట్ 13న ఈ మూవీని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు అవకాశాలను పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
మరో వైపు టక్ జగదీష్ కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత ఏడాది నాని నటించిన వీ చిత్రాన్ని కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇప్పుడు టక్ జగదీష్ చిత్రాన్ని 40 కోట్లకు కొనుగోలు చేసిందట. టక్ జగదీష్ ఓటీటీ డీల్ కూడా టీటౌన్ ను షేక్ చేస్తోంది. అయితే యూనిట్ మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటోంది.
Comments
Please login to add a commentAdd a comment