TV Actress Devoleena Bhattacharjee Got Secretly Married, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Devoleena Bhattacharje: ప్రియుడిని పెళ్లాడిన సీరియల్‌ నటి, మిస్టరీ మ్యాన్‌ ఎవరంటే?

Published Wed, Dec 14 2022 6:25 PM | Last Updated on Wed, Dec 14 2022 7:49 PM

TV Actress Devoleena Bhattacharjee Got Married, Photos Goes Viral - Sakshi

సాత్‌ నిభానా సాతియా(కోడలా కోడలా కొడుకు పెళ్లామా) సీరియల్‌ నటి దేవలీనా భట్టాచార్జి సీక్రెట్‌గా పెళ్లిపీటలెక్కింది. తన ప్రియుడితో ఏడడుగులు నడిచింది. లోనావాలాలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో దేవలీనా స్నేహితులు విశాల్‌ సింగ్‌, రష్మీ సింగ్‌, భావిని పురోహిత్‌ దంపతులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. ట్విటర్‌లో దేవలీనాకీ షాదీ(#DevoleenaKiShaadi) అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌గా మారింది.

చాలామటుకు ఫోటోల్లో విశాల్‌ సింగ్‌ వధువు పక్కన ఉండటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని చాలామంది పొరపడుతున్నారు. కానీ అది నిజం కాదు, అతడు స్నేహితుడు మాత్రమే! మరికొందరేమో ఇది నిజమైన పెళ్లా? లేదా ఏదైనా మ్యూజిక్‌ ఆల్బమ్‌ కోసం ఇలా రెడీ అయ్యావా? అని అడుగుతున్నారు. అటు దేవలీనా సైతం హల్ది, మెహందీ, పెళ్లి ఫోటోలు పెట్టిందే తప్ప వరుడి ముఖాన్ని చూపించలేదు. ఒక్క ఫోటోలో మాత్రం భర్త చేయిని పట్టుకుని ఉంది. అయితే నటి జిమ్‌ ట్రైనర్‌ షాన్వద్‌ షైఖ్‌ను పెళ్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సస్పెన్స్‌కు చెక్‌ పెడుతూ ఎట్టకేలకు తను పెళ్లాడింది ఎవరినో ప్రకటించింది దేవలీనా. ఆ మిస్టరీ మ్యాన్‌ మరెవరో కాదు ఫేమస్‌ జిమ్‌ ట్రైనర్‌ షోనూనే అని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు అప్‌లోడ్‌ చేసింది.

చదవండి: అందుకే హిందీ సినిమాలు ఫ్లాప్‌, కానీ సౌత్‌లో అలా కాదు: రాజమౌళి
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర జంట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement