
బుల్లితెర నటి తునీషా శర్మ షూటింగ్ సెట్‌లో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే! అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె తల్లితో సహా పలువురూ అనుమానపడ్డారు. కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె ఇరవై ఏళ్లకే తనువు చాలించడమేంటని, కచ్చితంగా ఏదో జరిగే ఉంటుందని పలువురు భావించారు. అయితే ఆమెది ఆత్మహత్యేనని పోస్ట్‌మార్టమ్ నివేదికలో రుజువైంది.
తునీషా, షీజాన్ ఖాన్‌లు ప్రేమించుకున్నారని, పదిహేను రోజుల క్రితం వీరు బ్రేకప్ చెప్పుకోవడంతో అది తట్టుకోలేక నటి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఉరేసుకోవడం వల్ల ఊపిరాడక మరణించిందని తెలిపారు. తన శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య వెనక ఎలాంటి లవ్ జీహాదీ కోణాలు లేవని స్పష్టం చేశారు. కాగా తునీషా ఆత్మహత్య కేసులో ఆమె మాజీ ప్రియుడు షీజాన్ మహ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! అతడిని నాలుగురోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
చదవండి: సీరియల్ నటి ఆత్మహత్య.. చివరి పోస్ట్ వైరల్
తల్లికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్స్
Comments
Please login to add a commentAdd a comment