సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్‌డేట్‌.. | UGadi 2022: Mahesh Babu Mass Look Release From Sarkaru Vaari Paata Movie | Sakshi
Sakshi News home page

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ న్యూ అప్‌డేట్‌, అదిరిపోయిన మహేష్‌ మాస్‌ లుక్‌

Published Sat, Apr 2 2022 6:21 PM | Last Updated on Sat, Apr 2 2022 6:29 PM

UGadi 2022: Mahesh Babu Mass Look Release From Sarkaru Vaari Paata Movie - Sakshi

ఉగాది పండగ సందర్భంగా మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్‌డేట్‌ ఇచ్చింది ‘సర్కారు వారి పాట’ మూవీ టీం. తాజాగా ఈ మూవీలోని మహేశ్‌ న్యూలుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా మేకర్స్‌ ‘ఈ న్యూయర్‌కు మాస్‌ కొత్త నిర్వచనం’ అంటూ మహేశ్‌ మాస్‌ లుక్‌ను పంచుకున్నారు. ఇది విడుదలైన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో మహేశ్‌ను చూస్తుంటే.. విలన్‌ను ఇరగదీసేందుకు రెడీ అవుతున్నట్టుగా ఉంది. ఈ మాస్‌లుక్‌ చూసి మహేశ్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

కాగా  పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మహేశ్‌ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement